Tiger Nageswara Rao : మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ వంశీతో కలిసి ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే దీని గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమా భారీ ఓపెనింగ్ ఈవెంట్, ప్రీ లుక్ పోస్టర్లు సగటు ప్రేక్షకుడిలో క్యూరియాసిటీని బాగా పెంచేశాయి. అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
Tiger Nageswara Rao : ఏడు కోట్లతో భారీ సెట్
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పాన్ ఇండియా మూవీగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం భారీ ఎత్తున ఒక సెట్ నిర్మించేందుకు మూవీ యూనిట్ సిద్ధమయ్యింది. మహానటి, జెర్సీ, శ్యామ్ సింగరాయ్ తదితర చిత్రాలకు పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ సెట్ ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 1970 కాలం నాటి స్టూవర్టుపురం విలేజ్ ని తలపించే భారీ సెట్ శంషాబాద్ సమీపంలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సెట్ విలువ అక్షరాల రూ.7 కోట్లు అట. సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరిస్తారట. అందుకే రూ.7 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ వెనకడుగు వేయలేదు. ఈ భారీ ప్రాజెక్ట్ బడ్జెట్లో ఎక్కడా రాజీ పడకూడదని ఆయన అనుకుంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులపై కూడా దృష్టి పెడుతున్నారు.
మూవీ స్టోరీ ఇదే
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
టైగర్ నాగేశ్వరరావు మూవీ ఓ బయోపిక్. ఇది 70ల నాటి ‘స్టూవర్టుపురం’ అనే గ్రామంలో పేరుమోసిన దొంగ చుట్టూ తిరుగుతుంది. ఈ గజదొంగని టైగర్ నాగేశ్వర్ రావు అంటూ అందరూ పిలిచేవారు. ఎందుకంటే ఇతను దోచుకున్న డబ్బును పేద ప్రజలకు పంచేవాడు. అయితే ఇదొక బయోపిక్ కాబట్టి రవితేజ మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్, గెటప్‌తో స్క్రీన్ పై అలరించడానికి రెడీ అయ్యాడు. పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా వర్క్ చేస్తున్నారు. ఇది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అనే 4 భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి జీ.వీ ప్రకాష్ సంగీత బాణీలు సమకూర్చనున్నాడు.