NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

రూపాయి గుడ్లు పెడుతోంది : ₹ బుల్ బుల్ జిగా జిగా

 

 

స్టాక్ మార్కెట్ జోరు ఆగటం లేదు. మార్కెట్లు చరిత్రలోనే గరిష్టాన్ని అందుకుని ముందుకు సాగుతున్నాయి. వారంలో మొదటి రోజైన సోమవారం సైతం సెన్స్్స్ 347 పాయింట్లు పెరిగి 45,426 వద్ద క్లోజ్ అయితే, నీఫ్టీ 97 పాయింట్లు పెరిగి 13,355 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ రెండూ ఆల్ టైం హై వద్ద ఉన్నాయి. అసలు ఎందుకు స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. ఇది ఎంత వరకు వెళ్తుంది?? ఈ బుల్ జోష్ సమయంలో మార్కెట్ లోకి రావొచ్చా?? పెట్టుబడులు పెట్టొచ్చా?? ఈ జోష్ ఇలాగే కొనసాగుతుందా?? అసలు ఎందుకు ఈ స్పీడ్ అంటే మార్కెట్ విశ్లేషకులు రకరకాల కారణాలు చెబుతున్నారు.

(అసలు ప్రాథమికంగా మార్కెట్ లో ఏం జరుగుతుందో చూద్దాం రండి..)

1. కోవిడ్ విపత్తు మొదలైనప్పుడు మార్కెట్ ఒకేసారి కింద పడింది. అత్యంత కనిష్టం నమోదు చేసుకుంది. మార్చి చివరినాటికి సెన్సెక్స్ 25 వేల పాయింట్ వద్దకు వెళ్ళిపోయింది. అలాగే నిఫ్టీ సైతం ఎనిమిదివేల పాయింట్ల వద్ద కదలాడింది. ఇప్పుడు క్రమంగా కోవిడ్ పరిస్థితులు సడలుతుంది దృష్ట్యా మార్కె వేగం పుంజుకుంది.
2. ఐరోపా అమెరికాల్లో కరోనా సెకండ్ వచ్చినట్లు భారతదేశంలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇది మార్కెట్కు కు సానుకూలం. భారత్లో గణనీయంగా కేసులు తగ్గుతున్నాయి. క్రమంగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో మార్కెట్ మరింత జోష్ తో సాగుతోంది.
3. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపు అమెరికా మార్కెట్ కు ఊపునిచ్చింది. డో జోన్స్, నాసడాక్ మంచి ఊపు మీద పరుగులు పెట్టాయి. ప్రపంచ దేశాలన్నింటికీ అమెరికన్ మార్కెట్ సూచి గా పనిచేస్తుంది. అమెరికన్ మార్కెట్లో పెరుగుదల నమోదు అయితే ఆ ప్రభావం మొత్తం ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు మీద ఉంటుంది.
4. మరోపక్క యూరప్ మార్కెట్లలో కూడా సానుకూల అంకెలు నమోదయ్యాయి. యురో నెక్స్ట్, లండన్ స్టాక్ ఎక్స్చేంజి, ఫ్రాంక్ ఫార్డ్ స్టాక్ ఎక్స్చేంజిలు కరుణ తర్వాత మెల్లగా పుంజుకోవడం మొదలుపెట్టాయి. అమెరికన్ యూరప్ మార్కెట్లు పుంజుకోవడం భారత్ స్టాక్ మార్కెట్ల పరుగుల్ని మరింత ముందుకు తీసుకెళ్ళింది.
5. కరోనా సమయంలో భారత్ స్టాక్ మార్కెట్ లోకి యువ పెట్టుబడిదారులు ఎక్కువగా వచ్చారు. కొత్తగా డిమ్యాట్ ఎకౌంట్ లో నమోదు చేసుకున్న వారే 40 నుంచి 50 లక్షల మంది ఉంటారని అంచనా. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయి. పెట్టుబడులు పెరగడం వల్ల కంపెనీల విలువ పెరిగింది స్టాక్స్ విలువ పెరిగింది.
6. పలు ఆర్థిక సర్వేలు పలు ఆర్థిక రంగ సంస్థలు ఇస్తున్న నివేదికల ప్రకారం కరోనా తర్వాత భారత జిడిపి గాని వృద్ధి గాని గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ 7% నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. మైనస్ లో కి వెళ్లి పోయిన జి.డి.పి తిరిగి ఉంచుకునేందుకు తగిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్థిక రంగ సంస్థలు అంచనాలు కడుతున్నాయి. ఇది మార్కెట్ కు ఊపును ఇస్తుంది.
7. గతంతో పోలిస్తే భారత స్టాక్ మార్కెట్ లోకి విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. కేవలం ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు మాత్రమే 27 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. సింగపూర్ మన దేశంలో 1100 బిలయన్స్ (రూపాయల్లో) పెట్టుబడులు పెట్టింది. ఇది ఆల్ టైం హై. ప్రతినెల ఫారన్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయే తప్ప, లాభాలు స్వీకరించి అవి వెనక్కి వెళ్లడం లేదు.

ఈ సమయంలో పెట్టుబడులు పెట్టొచ్చా?

ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అంటారు పెద్దలు… దాన్ని బురదలో పెట్టుకుని ఈ సమయంలో నడుచుకోవాలి. అంతే తప్ప గుడ్డిగా ఆశపడి స్టాక్ ను కొనుగోలు చేస్తే చిక్కులు తప్పవు. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతున్నా ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. చాలా ఆర్థిక సంస్థలు ఇచ్చిన సెన్స్్స్ నిరోధక పాయింట్లు తేలిపోయాయి. దింతో మార్కెట్ గమనం ఇప్పుడు ఎవరికీ అంతు చిక్కకుండా నే ఉంది.స్టాక్స్ కొనుగోలు పెరుగుతున్నాయే తప్ప, అమ్మెందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపడం లేదు. గతంలో లాభాల స్వీకరణ చేసి, దానిని మళ్లీ రోటేట్ చేసి పెట్టుబడులు పెట్టేవారు. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన కొత్త పెట్టుబడిదారులు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. దీంతో స్టాక్స్ పెరుగుతున్నాయి.
** డిసెంబర్ ఫస్ట్ నుంచి సెబీ రూల్స్ మారాయి. ఇవి పెద్దగా ప్రభావం చూపకుండానే స్టాక్ మార్కెట్ నడుస్తోంది. సెబీ రూల్స్ తర్వాత మార్కెట్ లో క్షిణత వస్తుందని చాలామంది భావించారు. అయితే పెట్టుబడిదారులు ఎవరు సెబీ రూల్స్ను పెద్దగా పట్టించుకోలేదు.
**  స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు ఒడిదుడుకులు మొత్తం కేవలం వార్తలు వల్ల ప్రభావితం అవుతాయి. చిన్నపాటి న్యూస్ సైతం మార్కెట్ ను దాని స్వభావన్నీ మార్చేయగలదు. కాబట్టి అత్యంత గరిష్టం లో ఉన్న సెన్సెక్స్ ఎలాంటి వార్తతో నైనా పడిపోయే అందుకు ఆస్కారం ఉందని చెప్పాలి.
**  దాదాపు స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్లో ని 30 ప్రధాన షేర్లు, నీఫ్టీలోని 50 షేర్లు లో దాదాపు అన్నీ తమ టార్గెట్స్ దాటి ఆల్ టైం హై వద్ద కదలడుతున్నాయి. అంటే వాటి గరిష్ట విలువ వద్ద ఉన్నాయి. ఈ సమయంలో ఆయా కంపెనీల్లో పెట్టుబడులు వల్ల పెద్దగా లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని షేర్లు కదలిక, కంపెనీ పరిస్థితి అంచనా వేసి పెట్టుబడి పెట్టవచ్చు.
ఏది ఏమైనా భారత స్టాక్ మార్కెట్ ఇంత వేగంగా ముందుకు కదలడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. 3,800 దగ్గర మొదలైన సెన్స్్స్ 2006 ఫిబ్రవరిలో 10 వేల పాయింట్స్ వద్దకు వస్తే, 2007 డిసెంబర్ 11 నాటికీ 20 వేల పాయింట్స్ వేగంగా అందుకుంది. మళ్ళీ 30 వేల మైలురాయి దాటడానికి 2015 మార్చ్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. కరోనా కాలంలో మళ్ళీ 25 వేల పాయింట్స్ కు పడి పోయిన భారత మార్కెట్ అత్యంత వేగంగా పుంజుకోవడం ఇదే తొలిసారి… మరి ఈ పరుగు ఎంతకాలం ఉంటుందో? ఎటువైపు తీసుకెళ్తున్నారో వేచిచూడాలి.

author avatar
Special Bureau

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju