Uppena : ఉప్పెన సినిమా ఎంత పెద్ద సెన్షేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ముగ్గురు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా, హీరోగా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, హీరోయిన్గా కృతిశెట్టి. ఈ ముగ్గురికి లైఫ్‌లో గుర్తిండిపోయే సినిమాగా ఉప్పెన నిలిచింది. ఈ సినిమాని నిర్మించిన సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్‌కి ఊహించవి విధంగా లాభాలను తెచ్చి పెట్టింది. ఇక బుచ్చిబాబు తన రెండవ సినిమాని కూడా ఇదే నిర్మాతలతో చేయనున్నాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటుండగా ఈసారి స్టార్ హీరోతో జత కట్టబోతున్నాడు బుచ్చిబాబు. అయితే ఈ దర్శకుడు తప్ప మిగతా టీం మొత్తం కలిసి మరో సినిమా చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారా సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. ఉప్పెన జంటని మళ్ళీ చూడాలని మెగా ఫ్యాన్స్ తెగ ఆరాట పడుతున్నారు. వాళ్ళ ఆరాటం తీరబోతోందని సమాచారం.
Uppena : ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన రెండవ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.
ఇక ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన రెండవ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటించింది. కాగా రీసెంట్గా వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా కూడా ప్రారంభమైంది. రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. కాగా కృతి శెట్టి నానితో శ్యాం సింగ రాయ్, రామ్ సరసన మరొక సినిమా చేస్తూనే.. సుధీర్ బాబుతో మరో సినిమా చేస్తోంది.