Vakeel Saab: పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘vakeel saab’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా టికెట్ల రేట్ లో భారీ మార్పులు రావడంతో ఈ చిత్రం కలెక్షన్లు తగ్గుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఎవరికీ అంతుచిక్కని రీతిలో పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీసు వద్ద చెలరేగిపోతున్నాడు.
ఈ శుక్రవారం వరకు ఎలాంటి సినిమాలు లేకపోవడం, పైగా ఈరోజు, రేపు సెలవు దినాలు కావడం ఈ చిత్రానికి భారీ ప్లస్ పాయింట్. పవన్ అభిమానుల గురించి తెలిసిందే…! ఎనిమిది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఎన్నిసార్లయినా చూడడానికి రెడీగా ఉంటారు. పైగా టికెట్ రేట్లు కూడా తగ్గిపోయాయి.
ఇక ఈ రెండు రోజులు కుటుంబాల నుండి భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆశించవచ్చు. మొత్తానికి ఈ చిత్రం నాలుగవ రోజు 13 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. సోమవారం ఈ మాత్రం రెవెన్యూ వచ్చింది అంటే అది మంచి పరిణామమే. ఇక ఈ రెండు రోజులు బుకింగ్స్, అలాగే ఈ వారాంతం వరకు సినిమా ఆడినప్పటికీ అటు ఇటుగా రూ. 95 కోట్ల దగ్గర సినిమా కలెక్షన్స్ ఆగవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ నెంబర్ రూ.88 కోట్ల కావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ స్టామినా తో పోల్చుకుంటే 88 కోట్ల చాలా తక్కువ. అయితే సెకండ్ వే కరోనా, రీమేక్ చిత్రం ఎఫెక్ట్, పవన్ కళ్యాణ్ పాత్రకు కొంచెం తక్కువ నిడివి ఉండటం వంటివి ఉండడంతో ఈ రేటి కలిగి ఈ చిత్రం ఉంది.
లేకపోతే ఈ చిత్రానికి వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ కి ఎప్పుడో 120 కోట్లకు పైగా కలెక్షన్లు పరుగులు పెట్టాల్సింది. టికెట్ రేట్లు ప్రభుత్వం తగ్గించడంతో అటుఇటుగా సాధించి డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు కొంతవరకు లాభాలను తెచ్చిపెట్టింది.