న్యూస్ సినిమా

వరలక్ష్మీ శరత్‌కుమార్ కి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ మించిన అవకాశాలు..!

Share

వరలక్ష్మీ శరత్‌కుమార్ కోలీవుడ్ లో అద్భుతమైన పాత్రలు చేస్తూ విపరీతమైన క్రేజ్ ని పాపులారిటీ సంపాధించుకుంది. కొన్ని పాత్రలకి కోలీవుడ్ లో వరలక్ష్మీ శరత్‌కుమార్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఖచ్చితంగా ఈ పాత్ర వరలక్ష్మీ తప్ప ఇంకెవరు చేయలేరన్నట్టుగా తన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ గా నటించకపోయినా అంతకంటే ఎక్కువ క్రేజ్‌నే సాధించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ క్రమంలో తమిళంలో వరసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తోంది. దాంతో టాలీవుడ్ మేకర్స్ కన్ను వరలక్ష్మీ మీద పడింది.

కొన్ని శక్తి వంతమైన పాత్రలు చేయడానికి టాలీవుడ్ లో వరలక్ష్మీ లాంటి క్రేజ్ ఉన్న నటి లేదన్నది ఒప్పుకొని తీరాల్సిందే. అందుకే మన దర్శక, నిర్మాతలు వరలక్ష్మీ కి మంచి అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వరలక్ష్మీ కి టాలీవుడ్ లో మాస్ మహారాజా రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. సముద్ర ఖని తర్వాత జయమ్మ గా అంతటి కీలక పాత్ర పోషించి సినిమాలో హైలెట్ గా నిలిచింది. దాంతో ఒక్కసారిగా వరలక్ష్మి కి టాలీవుడ్ లో బాగా పాపులారిటీ పెరిగిపోయింది.

నెగెటివ్ షేడ్స్ కలిగిన జయమ్మ పాత్రలో వరలక్ష్మీ అందరిని ఆకట్టుకొని ప్రశంసలు అందుకుంటోంది. అందుకే ఇప్పుడు ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలకి అలాగే అత్త పాత్రలకి వరలక్ష్మీ ని సంప్రదిస్తున్నారని సమాచారం. ఇక వరలక్ష్మీ కూడా ఎప్పటి నుంచో టాలీవుడ్ లో మంచి అవకాశాల కోసం ఎదురు చూసింది. ఇప్పుడు తను ఎదురు చూసిన అవకాశాలు దక్కే సమయం వచ్చిందని అంటున్నారు. ఇక కొంతకాలం వరలక్ష్మి కి టాలీవుడ్ లో కెరీర్ లో గొప్పగా నిలిచిపోయే సినిమాలు చేస్తుందని చెప్పుకుంటున్నారట.


Share

Related posts

అనుష్క , విజయ్ దేవరకొండ సినిమా విషయంలో అసలు సీక్రెట్ ఇదే ..!

GRK

బిగ్ బాస్ 4: మాట నిలబెట్టుకున్న హారిక..!!

sekhar

కరోనా ఎఫెక్ట్: కూరగాయలు అమ్ముతున్న ఫేమస్ డైరెక్టర్

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar