Nani: నేచురల్ స్టార్ నానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గట్టి షాకిచ్చాడు. ఈ మధ్య కాలంలో నానికి సాలీడ్ హిట్ దక్కలేదు. ఏ సినిమా చేసినా నానికి ఫ్లాప్ తప్ప చెప్పుకునే హిట్ రావడం లేదు. శివ నిర్వాణతో నమ్మకంగా చేసిన టక్ జగదీష్ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు నానీ పెట్టుకున్న ఆశలన్నీ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా మీదే. కోల్ కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకి నిర్మాత. చెప్పాలంటే ‘శ్యామ్ సింగరాయ్’ తో కూడా నాని ప్రయోగం చేస్తున్నాడు.
ఈ సినిమా కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పుకొస్తున్నాడు. గతకొంతకాలంగా నాని అలా చెప్పిన ఏ సినిమా హిట్ ఇవ్వలేదు. అసలే ఈ సినిమా ఓవర్ బడ్జెట్ అని ముందు కమిటయిన నిర్మాత తప్పుకున్నాడు. దాంతో నాని సన్నిహితుడే ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడు. దాదాపు 50 కోట్లు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక క్రిస్మస్ కానుకగా సోలోగా వద్దామనుకున్నాడు నాని. అందుకే డిసెంబర్ 24న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Nani: సడన్‌గా డేట్ మార్చి నానికి పోటీ వచ్చి వరుణ్ గట్టి షాకిచ్చాడు.
ఇప్పుడు వరుణ్ తేజ్ సాయీ మంజ్రేకర్ నటిస్తున్న గని చిత్రాన్ని కూడా అదే తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా విడుదల చేసిన టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. వాస్తవంగా డిసెంబర్ 3న గని రిలీజ్ అన్నారు. కానీ ఇప్పుడు సడన్‌గా డేట్ మార్చి నానికి పోటీ వచ్చి వరుణ్ గట్టి షాకిచ్చాడు. అంతేకాదు ఇప్పుడు నిర్మాతకు ఇది ఊహించని ట్విస్ట్. మరి ఈ రెండు సినిమాలలో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి నిలబడే సినిమా ఏదో తెలియాలంటే డిసెంబర్ 24 వరకు ఆగాల్సిందే. కాగా, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.