NewsOrbit
న్యూస్

ఇదేం లెక్క… ఏపీ లో రాష్ట్రపతి పాలన అంట!

నిమ్మగడ్డ నియామకంపై “హైకోర్టు తీర్పు – గవర్నర్ స్పందన” అంశంపై ఎవరికి నచ్చినట్లుగా వారు భావానువాదం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అసలు తీర్పు పాఠంలో ఉన్నదేమిటి… అసలు గవర్నర్ ఫైనల్ గా చెపిందేమిటి అన్న విషయాల్లో… ఎవరి క్రియేటివిటీకి వారు పనిచెప్పుకుని… “పరిశీలించండి” అనడానికి “నియమించండి” అనడానికీ ఉన్న తేడాను కూడా పక్కనపెట్టి ముందుకు పోతున్నారు! ఈ క్రమంలో వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం తనదైన స్పందనను తెలియచేస్తూ… తన ఊహలకు హద్దులేదని నిరూపించేప్రయత్నం చేశారు!

అలా జరగాలనేది ఆయన మనసులోని కోరికో లేక… అంతా స్పందిస్తున్నారు కదా తాను మరింత భిన్నంగా స్పందించాలనే తపనో తెలియదు కానీ… నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించకపోతే… రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు ఆర్.ఆర్.ఆర్.! ఈ విషయంలో తనదైన గోదావరి వెటకారంలో స్పందించే క్రమంలో… “నిమ్మగడ్డ నియామకంలో గవర్నర్ సూచన ప్రభుత్వానికి ఎదురు దెబ్బా, కదా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే…” అంటూ మొదలుపెట్టారు.. ఆర్.ఆర్.ఆర్.!

అనంతరం “ఇది మంచి పరిణామం.. గవర్నర్ గారు ఆలస్యం అయినా సరైన నిర్ణయం తీసుకున్నారు.. మా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఇంకా సాగతియ్యకుండా, గవర్నర్ నిర్ణయన్ని అమలు చెయ్యటమే ఉత్తమం! ఎందుకంటే ఇప్పటికే చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. రేపు సుప్రీం కోర్టుకు వెళ్ళినా ఇదే తీర్పు వస్తుంది. అలా కాదని ముందుకు వెళ్తే.. రాజ్యాంగా సంక్షోభం వస్తుంది. అప్పుడు ఆర్టికల్ 356 ఇన్వొక్ చేస్తే బలవంతంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవకాశం ఉంటుంది” అంటూ తన కోరికను అభిప్రాయంగా చెప్పినంత పనిచేశారు!!

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju