Suneel : టాలీవుడ్లో సునీల్ స్టార్ కమెడియన్గా ఆ తర్వాత హీరోగా పాపులరయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ లాంటి వారు తమ సినిమాలలో సునీల్ ఉండాలని ప్రత్యేకంగా దర్శక, నిర్మాతలకి చెప్పి సిఫార్సు చేసిన సందర్భాలు, సినిమాలు చాలానే ఉన్నాయి. అలా అతికొద్దికాలంలోనే స్టార్ కమెడియన్ అయిన సునీల్ కి హీరో అవకాశాలు దక్కాయి. కొన్ని హిట్స్ అందుకున్న సునీల్ ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. దాంతో సునీల్ కి అటు హీరోగా ఇటు కమెడియన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో సునీల్ మంచి అవకాశాలకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
మళ్ళీ అరవింద సమేత, డిస్కో రాజా లాంటి సినిమాలలో నటించాడు. కానీ ఆయనకి అంతగా పేరు మాత్రం దక్కలేదు. అయినా మంచి పాత్రల కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 5 భాషల్లో విడుదల కాబోతోంది. మైత్రీ వారితో ముత్యం శెట్టి మీడియా కలిసి 200 కోట్ల భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా రూపొందుతోంది. ఒక పార్ట్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. మరొక పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.
Suneel : మరి సునీల్ ఫేట్ ఐకాన్ స్టార్ పుష్ప అయినా మారుస్తుందా లేదా చూడాలి.
రష్మిక మందన్న హీరోయిన్గా నటుస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రిప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇందులో సునీల్ కీలక పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు. క్యారెక్టర్ ఏంటన్నది క్లారిటీ లేనప్పటికి చాలా స్పెషల్ అని మాత్రం తెలుస్తోంది. ఇక సునీల్ కి జంటగా అనసూయ భరద్వాజ్ నటిస్తోందట. ఇక వీరిద్దరు చిత్తూరు యాసలో డైలాగులు చెప్తారని సమాచారం. కాగా లాక్ డౌన్ పెట్టక ముందే సునీల్ – అనసూయ కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. మరి సునీల్ ఫేట్ ఐకాన్ స్టార్ పుష్ప అయినా మారుస్తుందా లేదా చూడాలి.