న్యూస్

YS Jagan – Chandrababu Naidu: జగనూ – చంద్రబాబు.. కాళ్ళు, కళ్ళు ఎక్కడున్నాయో..!? ఎదుటి వాళ్లపైనే ఆధారమా..!?

Share

YS Jagan – Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మూడు పార్టీలున్నాయి.. మూడో పార్టీని ఆటలో అరటిపండుగా పక్కన పెడితే.. రెండు పార్టీలు, రెండు వ్యవస్థలుగా బలీయంగా ఉన్నాయి..! జగన్ అత్యంత ప్రజాబలంతో కుర్చీలో ధీమాగా ఉండగా.., చంద్రబాబు రాజకీయ చరమాంకం దశలో ఉన్నట్టున్నారు..! ఈ రెండు ప్రధాన పక్షాల మధ్య విడ్డురమైన వాదన వినబడుతోంది. ఈ రెండు పార్టీలు.. తమ ప్రత్యర్థి పార్టీల గురించి ఏమనుకుంటున్నాయి..!? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి..!? అనే ఒక కీలక అంశాన్ని చూద్దాం..!

ys jagan chandrababu naidu political mistakes
ys jagan chandrababu naidu political mistakes

టీడీపీ నేల విడిచి సాము..!

“ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోలేదు. జగన్మోహన్ రెడ్డి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు.. అనేక వర్గాలు దూరమయ్యారు.. సో కాబట్టి రాబోయే ఎన్నికల్లో జనాలు టీడీపీకె ఓట్లు వేస్తారు. ఇంతకు ముందు ఒక్క అవకాశం అంటే ఓట్లు వేశారు. ఇప్పుడు మరో సారి ప్రజలు వైసీపీకి అవకాశం ఇవ్వరు” అనే లెక్కల్లో టీడీపీ ఉంది.. కానీ తమ కాళ్లపై తాము నిలబడే ప్రయత్నం చేయట్లేదు. కాళ్ళు, కళ్ళు నెత్తిన పెట్టుకున్నట్టే కనిపిస్తుంది.. అందుకే టీడీపీకి ఈ సారి 150 సీట్లు,130సీట్లు వస్తాయి అనే లెక్కల్లో టీడీపీ ఉంది. టీడీపీ లో అంతర్గతంగా ఈ డిస్కషన్ జరుగుతోంది..!

* ఇక వైసీపీ వాదన చూస్తే.. “2019 ఎన్నికల్లో టీడీపీ కి 23 సీట్లే వచ్చాయి.. అందులో నలుగురు పార్టీ కి దూరం అయ్యారు. ఆ పార్టీ ఇంకా తెరుకోలేదు. ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లి గ్రౌండ్ వర్క్ చేయడం లేదు. ఆ పార్టీ కి ఆర్ధిక మూలలపై దెబ్బ కొట్టేశాము. ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఆ పార్టీ నాయకులు ఇంకా కేసులకు భయపడుతున్నారు. ఇప్పట్లో టీడీపీ తేరుకునే అవకాశాలు లేవు, ఆ పార్టీ కి ఇంకా సీట్లు తగ్గుతాయి కానీ పెరిగే అవకాశం లేదు. కుప్పం మున్సిపాలిటీ కూడా గెలిచేశాము ఇక తమకు తిరుగులేదు” అన్న లెక్కలో వైసీపీ ఉంది..! కానీ తమపై ఉన్న వ్యతిరేకతని.. వివిధ వర్గాల్లో పెరుగుతున్న అసమ్మతిని.. పార్టీలో రగులుకుంటున్న అసంతృప్తులను గ్రహించడం లేదు..!

ys jagan chandrababu naidu political mistakes
ys jagan chandrababu naidu political mistakes

YS Jagan – Chandrababu Naidu: జగన్ ముందు బాబు కష్టమే..!

ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ కి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమిలేదు. మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలో వైసీపీకి బాగా తెలుసు. ఎందుకంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికార టీడీపీని ముప్పుతిప్పలు పెట్టారు. కొందరు పెద్దల సహకారంతో “ఎన్నికల సమయంలో టీడీపీకి ఇతర ప్రాంతాల నుండి రావాల్సిన నిధులు ఆగాయి.., టీడీపీ అభ్యర్థులు పంపిణి చేయలేక చేతులు ఎత్తివేసే పరిస్థితి.. కొందరిపై ఐటీ రైడ్స్ జరగడం.., ఇలా ముప్పుతిప్పలు వెనుక జగన్ హస్తం పరోక్షంగా ఉండే ఉంటుంది..! సో.., ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అన్ని తిప్పలు పెట్టగా లేనిది ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వ్యవస్థలు చేతిలో ఉన్నాయి. టీడీపీని ఇబ్బంది పెట్టలేరా..?అంత ఈజీగా వదులుతారా..? అందుకే వైసీపీలో ఒకింత ధీమా కనిపిస్తుంది. పోల్ మేనేజ్మెంట్ లో దిట్టయిన చంద్రబాబుకి.. పోల్ మేనేజ్మెంట్ లో తనకు మించిన వాడు లేడు అనేంతగా జగన్ చుక్కలు చూపించారు.

* అయితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే ఎన్ని చర్యలు చేపట్టినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అని కొందరు అనుకుంటున్నారు. అయితే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. సాధారణంగా 25 శాతం మంది మాత్రమే ఎటువంటి ప్రలోభాలకు సంభందం లేకుండా నేరుగా పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓట్లు వేస్తుంటారు. మిగతా వాళ్ళను రాజకీయ పార్టీలు తీసుకొని వచ్చి ఓట్లు వేయిస్తుంటారు. తమకు పడే ఓట్లను తీసుకొని వచ్చి వేయించుకోవడం తో పాటు ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని తమ వైపు కు తిప్పుకొని ఓట్లు పోల్ చేయించుకోవడమే పోల్ మేనేజ్మెంట్. దీనిలో టీడీపీ వెనుకబడుతోంది అన్న వాదన ఉంది. అధికారం లో ఉన్న వైసీపీ ఇందుకోసం అంతర్గత ప్రణాళిక సిద్ధం చేసిందని అంటున్నారు. టీడీపీకి ముందు చూపు లేదు. ధీమా ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్ప్పులు చేస్తున్నారు కాబట్టి తాము గెలుస్తాము అని లెక్కలు వేసుకుంటోంది.. గానీ వైసీపీ ఎటువంటి దెబ్బలు వేయబోతున్నాదో గ్రహించే పరిస్థితిలో లేదు.ఈలోగా సీఎం జగన్ తన తప్పులు కొన్ని దిద్దుకుని.. మళ్ళీ టీడీపీని ఇరికించేసి.. వైసీపీని టార్గెట్ 150 + దిశగా తీసుకెళ్లే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు..!


Share

Related posts

Maggie: మ్యాగీ ఆరోగ్యంగా, టేస్టీగా ఇలా తయారు చేసుకోండి..!

bharani jella

టైప్ 2 డయబిటిస్ కి క్యారెట్ జ్యూస్??

Kumar

బ్రేకింగ్ : ఫ్యాన్స్ ను అతి కష్టమైన కోరిక కోరిన మహేష్ బాబు..!

arun kanna