NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పై వైఎస్ షర్మిల ఆగ్రహం

YS Sharmila: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీగా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న షర్మిల కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవేళ కడప పెద్ద (అమీన్ పీర్) దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం  మాసాపేట సర్కిల్, దేవుని కడప, అశోక్ నగర్, అప్సరా సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఐటీఐ సర్కిల్, మరియాపురం, వినాయక్ నగర్, అల్మాస్పేట, చిలకలబావి, ఏడు రోడ్స్ మీదుగా బస్సు యాత్ర సాగింది.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో షర్మిల .. వివేకా హత్య కేసు అంశాన్ని ప్రధాన అస్త్రంగా ప్రసంగించారు. వివేకా హత్య కేసులో అవినాష్ ను సీబీఐ నిందితుడిగా తేల్చిందని అన్నారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని కోరారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.  దొంగలు దొంగలు బుజాలు తరుముకున్నట్లు అవినాష్ తీరు ఉందని అన్నారు. అవినాష్ త్యాగమూర్తి అయితే హంతకులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించారు. నిందితులతో కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నట్లు అని ప్రశ్నించారు. హత్య మీరు చేయక పోతే సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారు అని ప్రశ్నించారు. న్యాయం చేయాల్సిన సొంత ఆన్న చెల్లెళ్లపై నిందలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘హంతకులను చట్టసభలకు పంపొద్దని నేను ఎంపీ గా పోటీ చేస్తున్న.. అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేము బురద జల్లుతున్నం అంట. మా విజ్ఞతకు వదిలేస్తాడాట. ఇన్ని మాటలు చెప్పే బదులు కేసులో సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా..గూగుల్ మ్యాప్స్ కి మీకు సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా.. మీ కాల్ రికార్డ్స్ హంతకుల ఫోన్ రికార్డ్స్ తో ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి చెప్పండి..హంతకులకు మీకు సంబంధాలు ఎందుకు ఉన్నాయి చెప్పండి  అని షర్మిల అన్నారు.

ఇళ్లంతా రక్తం ఉంటే హార్ట్ ఏటాక్ తో చనిపోయారు అని ఎందుకు అబద్దం ఆడారో చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మన నాయకులు. ఒకరోజు ఇదే అవినాష్ రెడ్డి కోసం నేను ఒప్పుకున్నా. వివేకా నన్ను పోటీ చేయాలని అడిగితే వద్దు అని చెప్పిన దాన్ని నేను. నేను ఎంపీ సీట్ కావాలి అనుకుంటే నాకు ఆరోజే వచ్చేది కాదా ?. అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని భలపరిచింది నేను. జగన్ కోసం 3200 కిలీ మీటర్లు పాదయాత్ర చేశా. ఒక్కరోజు కూడా పదవి కావాలని అడగలేదు. ఇవ్వాళ ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. సునీతను, నన్ను అవమానిస్తున్నారు. నేను వైఎస్ షర్మిలా రెడ్డి కాదట…నేను వైఎస్ కి పుట్టలేదట. వివేకా ను సునీతా రెడ్డి హత్య చేయించింది అని నిందలు మోపారు. ఎన్ని మాట్లాడిన నేను భరించినా.. నిందలు మోపినా భరించా. అహంకారం తో మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ వివేకా నాకు చిన్నాన్న. నన్ను ఎత్తుకొని పెంచిన వాడు. ఆనాడు ముందు చూపుతోనే నన్ను కడప ఎంపీ గా పోటీ చేయాలని అడిగాడు. నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అప్పుడు నాకు అర్ధం కాలేదు. వివేకా మాట విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కాదు అన్నారు. వివేకా హత్య జరిగి 5 ఏళ్లు దాటింది. ఈనాటికీ హంతకులకు శిక్ష పడలేదు. చివరికి వివేకా బిడ్డ చంపింది అని ముద్ర వేశారు. న్యాయం కోసం సునీత ఎక్కని గడప లేదు. తిరగని కోర్టులు లేవు. ఒక పెద్ద మనిషి హత్య జరిగితే ఇంత వరకు న్యాయం జరగలేదు. సీఎం జగన్ కేసును పట్టించుకోవడం లేదు. సొంత చిన్నాన్న చనిపోతే సహాయం కూడా లేదు. స్వయంగా జగన్ హంతకులను కాపాడుతున్నాడు. ఈ 5 ఏళ్లు హంతకులను కాపాడి మళ్ళీ వాళ్ళకే సీట్ ఇచ్చారు. ఇది అన్యాయం, అధర్మం. హత్య చేసిన వాళ్ళకు సీట్ ఇవ్వడంతోనే నేను ఎంపీ గా పోటీ చేస్తున్నా. ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నా అని షర్మిల అన్నారు.

Raghurama Krishna Raju: రఘురామకు టిక్కెట్ కన్ఫర్మ్ .. ఎక్కడి నుండి అంటే..?

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N