NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ జ‌గ‌న్ తాజా షాక్‌…. పెట్రోల్‌పై బాదేశారు

ap cm ys jagan neglecting some ysrcp leaders

ఆంధ్ర ‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి షాక్ ఇచ్చారు. ap cm ys jagan neglecting some ysrcp leaders

ఓ వైపు సంక్షేమ అభివృద్ధి నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకుంటున్న సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోవైపు రాష్ట్ర అభివృద్ధి కోణంలో తీసుకున్న ఓ నిర్ణ‌యం అదే ప్ర‌జల‌ల‌కు షాక్ ఇచ్చేలా ఉందంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న దీనికి కార‌ణంగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి పెట్రోల్, డీజిల్ పై ఒక్క రూపాయి సెస్ విదిస్తున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్ర‌క‌ట‌న ఏపీ ప్ర‌జ‌లు జీర్ణించుకోలేనిద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

క‌రోనానే కార‌ణ‌మ‌ట‌

కోవిడ్ నియంత్రణలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ సూచనల మేరకు గత మార్చి 23 నుండి లాక్ డౌన్ విధించిన కారణంగా ఆర్ధిక కార్యకలాపాలు మందగించి రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ లో రాష్ట్ర రెవెన్యూ రూ. 4,480 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లో కేవలం రూ. 1,323 కోట్లు మాత్రమే ఉందన్నారు. అంచనా వేసిన ఆదాయంలో ఇది కేవలం 29.5 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో కూడా పరిస్థితులు ఇందుకు ఏ మాత్రం భిన్నంగా లేవని ర‌జ‌త్ భార్గ‌వ అన్నారు.

మంత్రి మండ‌లి ఆదేశాల వ‌ల్లే…

ఒకవైపు రాష్ట్రానికి రావలసిన ఆదాయం తగ్గిపోవడంతో పాటు కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా వైద్య, ఆరోగ్య సేవలకు అధిక మొత్తంలో ఖర్చు చేయడం, మరోవైపు అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ఖర్చు చేయవలసి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఒత్తిడి పెరిగిందని రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్ల‌డించారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత రోడ్ల అభివృద్దికి నిధులు ఖర్చు చేయవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని మంత్రి మండలి నిర్ణయం మేరకు పెట్రోల్, డీజిల్ పై ప్రస్తుతం ఉన్న పన్నులకు అదనంగా రోడ్ల అభివృద్ధికి గాను ఒక్క రూపాయి సెస్ ను విధించిందన్నారు. ఈ మేరకు ఏపీ వాట్ చట్టం 2005 కు సవరణలు చేస్తూ ప్రతిపాదించిన ఆర్డినెన్స్ కు శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలిపారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు.

ఈ డ‌బ్బుల‌న్నీ ఏం చేస్తారంటే?

కాగా, మంత్రి మండలి నిర్ణయం మేరకు పెట్రోల్, డీజిల్ పై ప్రస్తుతం ఉన్న పన్నులకు అదనంగా విధించిన‌ ఒక్క రూపాయి సెస్ ఆదాయాన్ని కేవలం రోడ్ల అభివృద్ధి, మౌళిక సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు ర‌జ‌త్ భార్గ‌వ‌ స్పష్టం చేశారు. రోడ్ డెవలప్ మెంట్ సెస్ ద్వారా సంవత్సరానికి రానున్న రూ. 500 కోట్ల ఆదాయాన్ని ప్రత్యేకించి రోడ్ల అభివృద్ధి, మౌళిక సౌకర్యాల కొరకు మాత్రమే వినియోగించేందుకు వీలుగా రోడ్ల డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేస్తారని ఆయన వివరించారు.

author avatar
sridhar

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju