వ్యాఖ్యసమానత్వం ఉండాల్సింది చేతల్లో! by Siva PrasadMarch 20, 2019 అన్నట్టు మొన్న మనం మహిళాదినోత్సవం జరుపుకున్నాం. కాని అసలు మనం రోజూ దినం పెడుతూనేవున్నాం. కడుపులో వున్న ఆడపిల్లని పుట్టకుండానే చంపేస్తున్నాం. ఇదివరకు పుట్టేది ఆడో మగో తెలిసేదికాదు.ఇప్పుడు టెక్నాలజీ ధర్మవాని ముందే తెలుస్తోంది.అయితే ఆ టెస్ట్ లోపల పిల్ల సరిగ్గా ఉందోలేదో తెలుసుకోవడానికి. ఏవైనా లోపాలు ఉంటే సరిచెయ్యడానికి ఎబోర్షన్ చేస్తారు.కానీ ఆడపిల్లని తెలియగానే చంపడానికి కాదు.ఏం నువ్వు ఆడదానివికావా, మీఅమ్మ ఆడది కాదా?మొగాడు వంశాన్ని ఉద్ధరిస్తాడా!కడుపులో చంపడానికి వీలులేకపోతే పుట్టగానే చంపేస్తున్నారు.ఖర్మ కొద్దీ అది పెరిగి పెద్దదైతే కట్టుకున్నవాడు చంపేస్తున్నాడు.లేకపోతే ఎవడో కుర్రాడు ప్రేమించడం లేదని చంపేస్తున్నాడు.కొంతమంది మహానుభావులు చంపరు, ఆత్మహత్య చేసుకునేవరకు బాధ పెడతారు.ఇంక మానభంగాలమాట అడగొద్దు, ప్రతిరోజు జరుగుతునేవుంది.మచ్చ ఆడదానికే!ఎన్నో మహిళా సంఘాలు, స్ర్తీ వాదులు ఉన్నారు, ఏ ఒక్కరు ఆపలేకపోతున్నారు.ఏడాదికి ఓసారి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. చేసి చూపించండి.యత్ర నార్యన్తు పూజ్యతే అన్నారు. ఎందుకూ.. చదివి ఆహా అనుకోవడానికా!సమానత్వం అని గెంతడం కాదు.పుట్టిన ప్రతి ప్రాణికి అన్ని హక్కులు ఉంటాయి. ఒకరు ఇవ్వనవసరం లేదు. ఈమహిళాదినాలు మానేసి బాధపడుతున్నవాళ్ళని ఆదుకోండి చాలు.-బీనాదేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ