NewsOrbit
Featured రాజ‌కీయాలు

నువ్వొకటంటే… నేను రెండంటా…!!

ఇద్దరిదీ ఒకటే మాట

ప్రపంచాన్నే కరోనా కలవరపెడుతోంది. కానీ ఏపీని కరోనాతోపాటు, వరదలు కూడా కల్లోలానికి గురిచేస్తున్నాయ్. అదే సమయంలో రాజకీయం సైతం రంజుగా మారిపోతోంది. సందర్భం ఏదైనా సరే అధికార పార్టీపై విమర్శల జడి కురిపించే ప్రతిపక్షం తాజాగా మరో బలమైన ఆరోపణ చేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఇప్పుడు అరెస్టులు-కరోనా విలయంపై సర్కారును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే టీడీపీ నాయకులను అరెస్టు చేస్తోందని… పైపెచ్చు కరోనా ప్రమాదం పొంచి ఉందని ఇందుకీలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై డబుల్ ధమాకా మోగించారు తండ్రి, తనయులు.

Both Chandra babu, Lokesh Attacks Jagan on Tdp leaders Arrests
chandra babu naidu lokesh

కరోనా ప్రమాదం తెలిసి కూడా… ?

దేశంలో ఎక్కడా పతనమవనంత దారుణంగా పడిపోయింది ఒక ప్రతిపక్షంగా టీడీపీ. కానీ వాయిస్ రెయిజ్ చేయడంలో మాత్రం ఆ పార్టీ మేటి. ప్రతిపక్షం వాయిస్‎ బలంగా విన్పిస్తుంది. సందర్భం ఏదైనా కానివ్వండి… అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డే కారణమంటూ… ఆ ఇద్దరూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదిగా ఇవాళ తండ్రి, తనయులు సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే అరెస్టు చేయడం దారుణమని… దోపిడి దొంగలకు, ప్రజల నుంచి వచ్చిన నాయకులకు తేడా తెలియదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డి, అచ్నెన్నాయుడు కరోనా బారిన పడటానికి కారణం ఎవరని నిలదీశారు. కరోనా ముప్పు తెలిసి ప్రజా నాయకుల పట్ల దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించారు. మొత్తంగా ప్రభుత్వం తీరు దారుణమని… కష్ట సమయంలో… టీడీపీ నాయకులను మరింత కష్టపెడుతున్నారంటూ ఆక్రోశం వెల్లగక్కారు చంద్రబాబు.

Both Chandra babu, Lokesh Attacks Jagan on Tdp leaders Arrests
ys jagan chandar babu naidu

ఒక్క ఛాన్స్ అంటూ లోకేశ్ విమర్శలు

జగన్ ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదని… కేవలం కక్ష సాధింపు కోసమేనంటూ సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు లోకేశ్. కరోనా, వరదల ముప్పుతో జనం ఇబ్బందులెదుర్కొంటుంటే… ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. కేవలం వ్యక్తిగత కక్షతో జేసీ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన 24 గంటల్లోతిరిగి అరెస్ట్ చేసి… కరోనా బారిన పడటానికి కారణం సీఎం జగన్ నేరమనస్తత్వమేనంటూ ఆరోపించారు.

Both Chandra babu, Lokesh Attacks Jagan on Tdp leaders Arrests
ys jagan lokesh

ఒకే అంశంపై తండ్రి, కొడుకుల నిప్పులు 

పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో అంశంపై మాట్లాడటం కామన్ గా జరుగుతుంది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో పార్టీ అగ్రనేతలిద్దరూ కూడా మాట్లాడటం… సోషల్ మీడియా వేదికగా వాయిస్ రెయిజ్ చేయడం ఇదే మొదటిసారి అంటున్నారు పార్టీ నేతలు. జేసీ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఇప్పటికే టీడీపీ లీగల్ టీం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. చాలా కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ వచ్చినా మరో కేసులు అరెస్టు చేయడంతో పార్టీ నేతల్లో వణుకు మొదలయ్యింది. ఇప్పటికే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టై… ప్రస్తుతం కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

author avatar
DEVELOPING STORY

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju