CBI Court: బిగ్ బ్రేకింగ్…రాజు గారి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

Share

CBI Court: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి సంబంధించి అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ అర్హతపై ఇటీవల సీబీఐ కోర్టు.. పిటిషన్ తరపున వాదనలు విన్నది. పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు నేడు కోర్టు వెల్లడించింది.

CBI Court taken ycp mp raju petition on jagan bail cancellation
CBI Court taken ycp mp raju petition on jagan bail cancellation

తమ నాయకుడు, సీఎం వైఎస్ జగన్ పై తనకు గౌరవం ఉందని రఘురామ కృష్ణం రాజు జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే 11 కేసుల చార్జిషీటులో ఏ 1 గా ఉన్నందున విచారణను ఎదుర్కొని నిర్ధోషిగా బయటకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. తన పిటిషన్ ను ఏసిబీ కోర్టు విచారణకు స్వీకరించిందన్న పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు తదుపరి కోర్టు సీబీఐకి,. జగన్ కు నోటీసులు జారీ చేస్తుందన్నారు. తన పై అనవసరంగా నోరు పారేసుకోవద్దంటూ వైసీపీ శ్రేణులకు ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడం ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.


Share

Related posts

రాజధానిపై పాలకొల్లులో ప్రజాబ్యాలెట్

somaraju sharma

నన్ను సస్పెండ్ చేయడాని వారు ఏవరు

sarath

మంగళగిరి పోలీసులకు మరో ముప్పు..!? కోర్టు ధిక్కరణ అంటూ హైకోర్టు ఆగ్రహం..!!

Special Bureau