NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Cinema-Politics: రాజకీయాల్లో పనికిరాని సినీ ఇమేజ్..! చిరంజీవే కాస్త బెటరా..!!

cine image is far away for politics

Cinema-Politics:  సినిమా, రాజకీయాలు Cinema & Politics సినిమావారికి రాజకీయాలు అంత సులువు కాదని.. ఒకప్పుడేమో కానీ.. ఇప్పుడా పరిస్థితులు ఏమాత్రం లేవని మరోసారి తేటతెల్లమైంది. ఇప్పటికే ఉన్న పార్టీల్లో చేరి నిలబడటం సంగతేమో కానీ.. పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లడం మరింత కష్టమైన పని అని తేలిపోయింది. తమిళనాడు స్టార్ హీరోల్లో ఒకరైన కమల్ హాసన్ మూడేళ్ల క్రితం ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. 2019 ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ.. అప్పుడూ ఇప్పుడూ కూడా ప్రజల ఓట్లు సాధించడంలో విఫలమయ్యారు. సాక్షాత్తూ కమల్ కూడా కోయంబత్తూరు దక్షిణాది నుంచి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు.

cine image is far away for politics
cine image is far away for politics

తెలుగు అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి 2008లోనే ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించారు. వైఎస్, చంద్రబాబు వంటి ఉద్దండుల మధ్యలో పార్టీ పెట్టి పెద్ద సాహసమే చేశారు. అయితే.. 2009 ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు.. 17 శాతం ఓట్లు సాధించారు. స్వయంగా చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయి.. తిరుపతిలో గెలిచి గట్టెక్కారు. చిరంజీవి సాధించిన ఫలితాలపై అప్పట్లో విమర్శలూ వచ్చాయి. కానీ.. ఇప్పుడు తమిళనాడులో కమలహాసన్ పార్టీ పూర్తిగా ఓడిపోవడంతో చిరంజీవి చాలా బెటర్ 18 సీట్లు సాధించారు.. అంటున్నారు. ఇక హీరో రజినీకాంత్.. పార్టే పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆరోగ్యం బాలేదని వెనకడుగేశారు. తన పర్సనల్ సర్వే ప్రకారమే రజినీ వెనకడుగు వేశారనే వాదనా లేకపోలేదు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అయితే.. అసలు పార్టీ పెట్టలేదు. కాంగ్రెస్ తరపున ఓసారి పోటీ చేసి మళ్లీ రాజకీయాల్లోకి రాలేదు. తెలుగులో చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ జనసేన స్థాపించారు. 2014లో టీడీపీ-బీజేపీకి మద్ధతిచ్చిన ఆయన ట్వీట్లతోనే పార్టీని ఐదేళ్లు నడిపించి 2019లో ఏపీలో పోటీ చేశారు. అయితే.. అనూహ్యంగా స్వయంగా పవనే తాను పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోగా.. పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. కర్ణాటకలో హీరో ఉపేంద్ర కూడా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లలేదు. తమిళనాడులో విజయకాంత్ పార్టీ పెట్టి తొలిసారి తానొక్కరే గెలిచారు. మలి ఎన్నికల్లో సత్తా చాటారు. ఇలా.. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సినీ నటులకున్న సినీ ఇమేజ్ రాజకీయాల్లో ఉండటంలేదనే చెప్పాలి..

 

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !