గీతం ఏమైనా ప్రత్యేకమా..!? బాబుతో బంధం ఉంటే చాలా..!?

మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారా.. ? మీరు ఒక ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటున్నారా..? అయితే కానిచ్చేయండి. స్థలం అవసరమే లేదు..! చంద్రబాబుతో బంధం ఉంటే చాలు..!. అదే వచ్చేస్తుంది. 50 ఎకరాల్లో కాలేజీ అయినా.. అరెకరంలో ఇల్లు అయినా.. రెండెకరాల్లో ఫ్యాక్టరీ అయినా.. ఏదైనా ఇట్టే వచ్చేస్తుంది. కాకపోతే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో… మాత్రం గ్యారెంటీ ఉండదు. అచ్చం మన గీతం లాగా..!.

కాలేజీ కట్టాలన్నా, ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా… స్థలం తీసుకుని సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని… అన్నీ పక్కాగా దస్త్రాలు సిద్దమైన తరువాత కట్టాడాలు ప్రారంభిస్తాం. ఫ్యాక్టరీ పెట్టాలంటే ఫరమ్ రిజిస్ట్రేషన్, ఆర్ఓసి, ఆ ఫరం పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయడం అన్నీ పక్కాగా ఉంటాయి. యూనివర్శిటీ పెట్టాలంటే ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేసి ట్రస్ట్ పేరిట భూములు, ప్రభుత్వ భూములు అయితే లీజు తీసుకోవడం ఇవన్నీ పక్కాగా ఉంటాయి, ఉండాలి..! ఇది రాష్ట్రంలో, దేశంలోగానీ ఎక్కడైనా ప్రక్రియ ఇలానే ఉంటుంది. కానీ గీతం యూనివర్శిటీ అనే బ్రాండ్ ఎందుకు తప్పటడుగు వేసింది..? అనేదే ఇక్కడ ప్రశ్న. నిజానికి గీతం యూనివర్శిటీ మన రాష్ట్రంలో ప్రఖ్యాత సంస్థల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబుతో ఉన్న బంధం అక్రమాలను కళ్లు మూసుకొని చేసుకునే తత్వాన్ని అలవాటు చేసి ఆ యూనివర్శిటీ పరువు బజారున పడవేసింది. భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. నిబంధనలు వదిలేసింది కాబట్టే గీతం యూనివర్శిటీ ఉన్న పళంగా పాతాళానికి దిగాల్సి వస్తుంది..!

విద్యాసంస్థలు నడుస్తున్న తీరు ఎలా ఉందంటే.. ?

దేశంలో విద్యావ్యవస్థ అంటే ఓ ఉన్నత స్థానం ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి విద్యాసంస్థలు సేవా దృక్పదంతో మాత్రమే నడపాల్సి ఉంటుంది. కానీ రెండు మూడు దశాబ్దాల నుంచి విద్యలో లాభాపేక్ష, వ్యాపార దృక్పదం అలవాటై శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పోరేట్ సంస్థల సహా ఇదిగో ఈ గీతం లాంటి సంస్థలు కూడా పుట్టుకువచ్చి యథేచ్ఛగా అక్రమాలను, ఆక్రమణలను నడిపిస్తున్నాయి. జానెడు భూమి కొనుగోలు చేసి బారెడు ప్రభుత్వ భూమి (అత్యంత ఖరీదైన)ని ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు కట్టించేసి విద్యాసంస్థలను నడిపించేయడం.., ప్రభుత్వం ఉన్నంత కాలం.. చంద్రబాబు లాంటి వాళ్లు కుర్చీలో కొనసాగినంత కాలం కంటిన్యూ అవుతుంది. తరువాత ఆ వికృత కార్యం బయట పడక తప్పదు. ఇప్పుడు గీతం యూనివర్శిటీలో అదే జరిగింది.

cm jagan big shock to chandrababu about gitam
cm jagan big shock to chandrababu about gitam

కొసమెరుపు ఏమిటంటే..?

ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపులు కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు జాతీయ వైద్య మండలి అధికారులను ఎలా మెనేజ్ చేశారు? గీతం యూనివర్శిటీకి ఆక్రమణ భూముల్లో అక్రమ కట్టడాలు చేసిన తరువాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు? అనేదే ఒక పెద్ద ప్రశ్న. మొత్తానికి గీతం అనే బ్రాండ్ కాస్త ఈ నాలుగైదు రోజుల్లోనే పాతాళానికి పడిపోయి, విద్యావ్యవస్థ పాపం చేసుకుందా అనేంతగా ఒక పాఠాన్ని బోధించింది. బాబుతో బంధమో? పార్టీతో అనుబంధమో? గానీ గీతం విశ్వవిద్యాలయం కథ ఇలా ఈ దశకు చేరుకుంది. పైగా ఈ వ్యవహారాలు అన్నీ ఏదో సక్రమమే అయినట్లు ఆ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని కట్టేయడం ఘనకార్యం అన్నట్లు చంద్రబాబు అండ్ బ్యాచ్, అనుకూల మీడియా కూడా బాకాలు వాయిస్తుండటమే మరో కొసమెరుపు..!