NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వీడని జమ్మలమడుగు పీటముడి

కడప, జనవరి 24: కడప జిల్లా, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం పీటముడి వీడలేదు. ఈ సీటు కోసం ఇద్దరు సీనియర్ నాయకులు పట్టుబడుతున్నారు.  జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఆశిస్తున్నారు. ఈ స్థానం ఇద్దరూ తమకే కావాలని పట్టుపట్టడంతో పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెంతకు చేరింది. పోటీ పడుతున్న ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సీటుకూ, మరొకరు కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు సమాచారం. రామసుబ్బారెడ్డి గతంలో మంత్రిగా పని చేశారు. వైసిపి నుండి గెలిచి పార్టీలో చేరిన ఆదినారాయణరెడ్డి నేడు మంత్రిగా ఉన్నారు. తొలి నుండి పార్టీలో ఉన్న రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి 2004,2009,2014 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు రామసుబ్బారెడ్డిపైనే ఆదినారాయణ రెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. 2014లో వైసిపి తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి తరువాత టిడిపిలో చేరి మంత్రి పదవి చేపట్టారు. ఈ నియోజకవర్గం దివంగత శివారెడ్డి కాలం నుండి రామసుబ్బారెడ్డి కుటుంబానికి, టిడిపికి కంచుకోటగా ఉండేది. ఈ కారణంగా రామసుబ్బారెడ్డి తనకే అసెంబ్లీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరో పక్క మంత్రి హోదాలో ఆదినారాయణ రెడ్డి కూడా తనకే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ, మండలి విప్ పదవి ఇచ్చి అధిష్టానం బుజ్జగించినప్పటీకీ ఆయన అసెంబ్లీ సీటుపై పట్టువీడటం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందవచ్చని ఇద్దరు అసెంబ్లీ  స్థానాన్నే కోరుతున్నారు.

ఈ సీటుపై బుధవారం ఉదయం చంద్రబాబు సమక్షంలో చర్చలు జరిపినా పరిష్కారం రాలేదు. సాయంత్రం మరో సారి చర్చించేందుకు నిర్ణయించగా సాయంత్రం చర్చలకు రామసుబ్బారెడ్డి గైర్హాజరు అయ్యారు.

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి అనుచరులు, మద్దతుదారులు ఎమ్మెల్యే పదవిపై పట్టువీడవద్దని చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటు కార్యకర్తలను సముదాయించలేక, అటు పార్టీ అధినేత మాట కాదనలేకపోతున్నారు. ఇద్దరు ఒక అవగాహనకు రాలేకపోవడం పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. గురువారం సాయంత్రం చర్చలు ఒక కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నారు.

 

 

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Leave a Comment