NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వైసీపీతో టచ్ లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో “కన్నా”..!!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిపోయింది. ఊహించినట్లే కన్నా లక్ష్మీ నారాయణ ను తప్పించించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆయన పదవిలోకి వచ్చారు. దీని వెనుక అనేక రాజకీయ కారణాలు జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ పెద్దల లాబీయింగ్ లు ఫలించాయా? లేదంటే కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేక బృందం వ్యూహాలు ఫలించాయా? అనేవి తెలియాల్సి ఉంది.

వైసీపీతో బాగానే ఉంటే ఇలా అయ్యేది కాదేమో!

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుండి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తురనే విమర్శ ఉంది. సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన మూడు రాజధానులను వ్యతిరేకించడం, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని తరచూ విమర్శించడం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కల్పించుకొని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం తెలిసిందే. అదే విధంగా ఇటీవల పార్టీ లైన్ కు భిన్నంగా మూడు రాజధానుల బిల్లు ఆమోదించవద్దంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కన్నా లేఖ రాయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అందుకే కన్నాకు ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నూతన అధ్యక్షుడుగా నియమితులైన సోము వీర్రాజు కు ఆర్ఎస్ఎస్ బ్యాక్ రౌండ్ ఉంది. సోము వీర్రాజు మొదటి నుండి టీడీపీకి వ్యతిరేకంగా ఉండేవారు. నాడు ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడు, తరువాత కూడా టీడీపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతుండేవారు. ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. జరిగిన రాజకీయ పరిణామాలు అన్నీ పరిశీలిస్తే బీజేపీ ఏపి అధ్యక్షుడి మార్పు విషయంలో వైసీపీ రాజకీయం ఎంతో కొంత ఫలించిందని అనుకుంటున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న కన్నా ను తప్పించి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న సోము వీర్రాజును నియమించడంపై ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju