Sonu Sood: సోనుసూద్ వెనక కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్..! నిజమెంత?

political parties behind sonu sood
Share

Sonu Sood: సోనుసూద్ Sonu Sood: ప్రస్తుతం దేశంలో మోగిపోతున్న పేరు. గతేడాది నుంచి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ హీరో అయ్యాడు. అయితే.. సోనూసూద్ చారిటీపై గతేడాది మహారాష్ట్ర బీజేపీ ఎంపీలే విరుచుకుపడ్డారు. ఆయనకు అంత ఆదాయం ఉందా? ఎంత ఆస్తి ఉంది? ఆయన వెనక ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలు ఉన్నాయి. వీటికి ఊతమిచ్చేలా ఇటివల కొన్ని రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఓ నెటిజన్ హీరో అంటే.. నేను కాదు ‘సోనూసూద్ హీరో’ అంటూ ట్వీటారు. సోనూసూద్ అయితే.. చంద్రబాబును పొగిడేశారు. కేంద్రంలో కాంగ్రెస్ మొదటినుంచీ వెనకేసుకొస్తోంది. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్ రాజకీయ ప్రణాళికకు ఏదో జరుగుతోందనే అనుమానం రాకపోదు.

political parties behind sonu sood
political parties behind sonu sood

సోను సాయాన్ని వెనకుండి నడిపిస్తోంది కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ అనే వాదనలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో సోనును తరపు ముక్కగా ఉపయోగించే క్రమంలో అతని సాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయనే సందేహాలు వస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ విజయంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పటినుంచే అనుమానాలు ఉన్నాయి. ప్రజల్లో సోనుసూద్ కు విశేష ఆదరణ ఉంది. సోనూను ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తే ఆ ప్రభావం గట్టిగానే ఉంటుందనే ఈ పార్టీలు భావిస్తున్నట్టు చెప్పాలి. పైగా.. ఒకరికొకరి మధ్య జరుగుతున్న పొగడ్తలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బీజేపీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. కాంగ్రెస్ నాయకత్వలేమి, నేతల కొరత బీజేపీకి లాభం కలిగిస్తుందని ఓ వాదన.

Read More: YS Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఉద్దేశం ఏమిటో..!?

తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోందన్న సంకేతాలు ఉప ఎన్నికలతో తేలింది. ఏపీలో జగన్ దూకుడు.. టీడీపీ ఉన్న పరిస్థితులు మొన్నటి స్థానిక ఎన్నికల్లో తేలింది. సినిమాల్ సోనూ విలన్ క్యారెక్టర్లు చేస్తూ.. దేశవ్యాప్తంగా ఇంత చారిటీ చేయడం విశేషమే. అయితే.. సోనూపై తెలుగు రాష్ట్రాల పొలిటికల్ పార్టీలే ఫోకస్ ఎక్కువ చేస్తున్నాయి. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టినా.. చిరంజీవి, చరణ్ తో ఫ్రెండ్షిప్ ఉన్న కేటీఆర్ కనీసం స్పందించలేదు. గతేడాది చిత్తూరు జిల్లాలో ఒక కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చిన సోనూసూద్ ను చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. చిరంజీవి సాయంపై నోరు మెదపలేదు. రాజకీయ లాభం కోసం చంద్రబాబు వ్వవహరించే తీరుపై అనేక కథనాలు ఉన్నాయి. పై వార్తను నిర్ధారించే అంశాలేవీ లేకపోయినా.. జరుగుతున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి..!


Share

Related posts

పీఎం పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన..! ఎంపీ రేవంత్ పిర్యాదు..!!

somaraju sharma

Eatela Rajendar: ఈట‌ల రాజేంద‌ర్ విజ‌యానికి అయోధ్య రాముడికి లింక్ ఏంటో తెలుసా?

sridhar

YS Jagan : ఎలక్షన్ ముందు జగన్ డేరింగ్ నిర్ణయం – ఆయనకి కీలక పదవి ?

somaraju sharma