NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

Congress: ప్రియాంక-రాహుల్ నాటుతున్న విత్తనాలు.. మూడేళ్లకైనా ఫలాలిస్తాయా..?

Congress Party: APCC Chief Special Focus by PK and Priyanka

Congress: కాంగ్రెస్ Congress ఘన చరిత్ర ఉన్న పార్టీ పరిస్థితి ప్రస్తుతం చూస్తే ఆశ్చర్యం ఓవైపు.. జాలి మరోవైపు కలుగుతాయని చెప్పాలి. వందేళ్లకు పైగా ప్రస్థానం ఉన్న పార్టీ ప్రస్తుతం తన అడుగులు చాలా భారంగా వేస్తోంది. రీసెంట్ పుదుచ్చేరిలో పరిస్థితి మరో ఉదాహరణ. అధికారంలో ఉన్న చోట్ల కూడా పార్టీ నాయకుల్ని కాపాడుకోలేని స్థితి. ఏళ్లుగా రాష్ట్రాల్లో ఏకచత్రాధిపత్యం చెలాయించిన ఆ పార్టీకి ఇప్పుడు పూర్వ వైభవం సాధించాల్సిన పరిస్థితి ఎంతో అవసరం. ప్రస్తుతం ఆ బాధ్యతను తమ భుజాలపై వేసుకుని మోస్తున్నారు ప్రియాంక, రాహుల్.

Priyanka and rahul trying their best for congress
Priyanka and rahul trying their best for congress

విజయం కోసమో.. ఉనికి కాపాడుకునేందుకో గానీ.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ తాపత్రయపడుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. స్థానిక యువతతో చెరువులోకి దూకి ఈత కొట్టడం, చిన్నారులతో కలిసి భోజనం చేయడం చేసారు. తమిళనాడులో ఒక విద్యార్ధినితో పోటీ పడి పుషప్స్ తీయడం కూడా జరిగింది. బాలిక నెమ్మదిగా పుషప్స్ తీస్తే.. రాహుల్ చాలా వేగంగా తీశారు. ఆయాసం కూడా ఆయనలో కనపడలేదు. వెంటనే సింగిల్ హ్యాండ్ తో కూడా పుషప్ తీసి చిరునవ్వు నవ్వారు.

ఇక ప్రియాంక గాంధీ కూడా పర్యటనలో తన మార్కు చూపిస్తున్నారు. అసోం టీ తోటల్లో స్థానిక మహిళలతో కలసి తేయాకు తోటల్లో పని చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేవి కాకపోయినా.. కాంగ్రెస్ పార్ట ఉనికిని చాటుకునేవి అని మాత్రం చెప్పాల్సిందే. రాష్ట్రాల్లో సొంతంగా మెజార్టీ రావడం లేదు. పొత్తులతో అధికారం చేపట్టినా నిలవడం లేదు. ఇదంతా కాంగ్రెస్ ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంతో ప్రియాంక, రాహుల్ చేస్తున్న ఒంటరి పోరాటం కాంగ్రెస్ కు సమీప భవిష్యత్తులో మళ్లీ మంచి రోజులు దక్కేందుకు ఉపయోగపడాయని చెప్పాలి.

రోజురోజుకీ బీజేపీ పాలనపై ప్రజల్లో కొత్త అనునమానాలు రేకెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఢిల్లో రైతుల ధర్నాలు.. ఇవన్నీ బీజేపీపై కొత్త ఆలోచనలకు కారణమవుతున్నాయి. గ్యాస్ ధర మళ్లీ 25 రూపాయలు పెరగడం ఇందుకు ఓ నిదర్శనం. పెట్రోల్ రేట్లపై చేతులెత్తేసిన కేంద్రానికి వ్యతిరేకంగా పాల రేట్లు పెంచేస్తున్నారు. ఇవన్నీ.. ఇప్పటికిప్పుడు బీజేకి నష్టం.. కాంగ్రెస్ కు లాభం చేయవు. కానీ.. ప్రియాంక, రాహుల్ చేస్తున్న పర్యటనలు ఈ మూడేళ్లలో కాంగ్రెస్ గురించి ప్రజలు ఆలోచించేందుకు మాత్రం ఊతమిస్తాయని చెప్పాలి. ఏమో.. గుర్రం ఎగురావచ్చు..!!

 

 

author avatar
Muraliak

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju