NewsOrbit
రాజ‌కీయాలు

ఆయన “అజేయు”డే… ఇక “కళ్లెం”వేయలేరు..!!

సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంలో విశ్రాంత ఐఏఎస్ ల పాత్ర ప్రముఖంగా చెప్పుకోవాలి. ఐవైఆర్ కృషారావు, అజయ్ కల్లం రెడ్డి లాంటి సీనియర్ ఐఏఎస్ లు చంద్రబాబు పరిపాలన దగ్గరగా చూసి చంద్రబాబు పరిపాలనలో పనిచేసి లోపాలన్నీ తెలుసు కొని, ఎన్నికలకు ఆరు నెలల ముందు బాబుకు వ్యతిరేకంగా ప్రజల ముందుకు వచ్చారు. బాబు చేసిన పొరపాట్లను సాక్ష్యాలతో సహా జనాలకు అర్థం అయ్యేలా మీడియాకు వెల్లడించారు. ఐవైఆర్ కృష్ణారావు కంటే అజయ్ కలం రెడ్డి చేసిన కొన్ని ఆరోపణలు, ఆయన వెల్లడించిన కొన్ని అంశాలు ఒ వర్గం ప్రజలపై బాగా ప్రభావాన్ని చూపాయి. ఎంతో కొంత వైఎస్ జగన్మోహన రెడ్డికి, వైకాపాకు అవి ఉపయోగపడ్డాయి. ఆ ఫలితమే జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే అజయ్ కలం రెడ్డికి తన పేషీ లోనే ప్రత్యేక కార్యదర్శిగా ఒ హోదా కల్పించి గౌరవాన్ని ఇచ్చారు.

ప్రస్తుతం ప్రభుత్వంలో లో అజయ్ కలాం రెడ్డి పాత్ర బాగా పెరిగింది. సీనియర్ ఐఏఎస్ ల్లో ఐవైఆర్ కృష్ణారావు జగన్ కు దూరమై బిజెపి పంచన చేరగా, జగన్ ను బాగా నమ్మిన, జగన్ కూడా కూడా బాగా నమ్మిన ఎల్వీ సుబ్రమణ్యం ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే జగన్ తో పేచీ పెట్టుకొని దూరమయ్యారు. ప్రస్తుతం జగన్ దగ్గర ఉన్న ఐఏఎస్ లలో ధనుంజయరెడ్డి, ప్రవీణ్ ప్రకాష్.. వీళ్ళందరూ కీలకంగా పని చేస్తుండగా, మాజీ హోదాలో ఒక సీనియర్ గా ఐఏఎస్ లందరికీ పెద్దదిక్కుగా అజయ్ కలాం రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో అయనపై కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ, కొన్ని వివాదాలలో తలదూర్చి నప్పటికీ క్రమేణా అయన తేరుకున్నారు. జగన్ ఇచ్చిన ప్రాధాన్యత, పార్టీలోనూ.. అటు ప్రభుత్వంలోనూ ప్రత్యేక స్థానం కల్పించడంతో అజయ్ కలాం రెడ్డి కూడా చురుకైయ్యారు. కీలక అంశాలపై నాయకులకు, ఐఏఎస్ లకు సలహాలు ఇస్తూ, కొంత మేరకు సబ్జెక్టు ఉన్న కంటెంట్ అందిస్తూ.. నాయకులు ఎలా మాట్లాడాలో చెబుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విద్యుత్ బిల్లుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి అజయ్ కలాం రెడ్డి నుండి స్పష్టమైన సమాధానమే వచ్చింది. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేనంతగా ఒక ఐఏఎస్ మాట్లాడితే ఎంత దీటుగా సమాధానం చెప్పగలరో అజయ్ కల్లాం రెడ్డి చూపించారు. ఈ ఫలితంగా నిర్మల సీతారామన్ చేసిన ఆరోపణలన్నీ సమసిపోయి అజయ్ కలాం రెడ్డి ఇచ్చిన సమాధానమే హైలెట్ అయ్యింది. ఇదే అదునుగా కొన్ని రాజకీయ పరిపాలన నిర్ణయాల్లో కూడా అజయ్ కల్లాం రెడ్డికి జగన్మోహన రెడ్డి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. గడచిన రెండు మూడు రోజులుగా కూడాఅజయ్ కలాం రెడ్డి ఇటు వైసీపీ ముఖ్య నాయకులు రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలతో పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారట. పరిపాలన సంబందిత అంశాలపైనే కాకుండా, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు ముఖ్యంగా పట్టాభి రామ్ వంటి వారు చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా అజయ్ కలాం రెడ్డే సబ్జెక్ట్ తయారు చేసి పార్టీ నేతలకు అందిస్తున్నారుట. ఇలా ఒక ఐఏఎస్..రాజకీయ నాయకులకు సలహాలు.. సూచనలు అందిస్తే ఫలితం ఎలా ఉంటుందో అజయ్ కలాం రెడ్డి నిరూపిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju