NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్ష!

విజయవాడ: వైసీపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా తాను ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్టు టీడీపీ అధినేత. మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన విజయవాడ వేదికగా దీక్ష జరుగుతుందని, తాను ఉదయం నుంచి రాత్రి వరకూ 12 గంటలపాటు దీక్షలో కూర్చుంటానని వెల్లడించారు. ఇసుక నిల్వలు వరదల్లో కొట్టుకుపోయాయన్న మంత్రి సురేష్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, మంత్రులు చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ వ్యాఖ్యానాలే అని అన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం మానవత్వం లేదని మండిపడ్డారు. చనిపోయినవారిని కూడా అవమానించే ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. ఒక వ్యక్తి మారితే ఇంత అరాచాకమా ? అని ప్రశ్నించారు. చేతకాని పాలనకు ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్యలే ఒక కేస్టడీ అని అన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ తీసుకురావాలని, ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  పనులు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది టీడీపీయేనని చంద్రబాబు గుర్తు చేశారు. ఆగస్టు 30న, అక్టోబర్ 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన, ఆందోళనలు చేశామని తెలిపారు. విశాఖలో జనసేన లాంగ్ మార్చ్‌కు మద్దతిచ్చామని, ప్రజా సమస్యలపై ఎవరు ఆందోళనలు చేసినా టీడీపీ సంఘీభావంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పట్లో వనజాక్షి అంశంపై వైసీపీ దుష్ప్రచారం చేసిందని చంద్రబాబు విమర్శించారు. డ్వాక్రా మహిళలు, అధికారిణి మధ్య వివాదాన్ని రాజకీయం చేశారన్నారు. వన్ మ్యాన్ కమిషన్ వేసి పరిస్థితిని చక్కదిద్దామన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆ ఒక్క ఘటన తప్ప మరో సంఘటన జరగలేదన్నారు. చింతమనేని ప్రభాకర్‌పై అక్కసుతోనే టీడీపీని టార్గెట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఉచిత ఇసుక పంపిణీ అన్ని సమస్యలకు పరిష్కారమని చంద్రబాబు అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10వేల పరిహారం ఇవ్వాలని, ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ జెండాకు వైసీపీ రంగులు వేసి అవమానించారని మండిపడ్డారు. కోడెల ఆత్మహత్య వైసీపీ వేధింపులకు పరాకాష్ట అని అన్నారు. 150 రోజుల్లో 630 అరాచకాలకు పాల్పడ్డారని, చలో ఆత్మకూరు ఆందోళనలతో కార్యకర్తల్లో ధైర్యాన్ని ఇచ్చామన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులను లీగల్ సెల్ సమగ్రంగా పరిశీలిస్తోందని, కార్యకర్తలకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Leave a Comment