విశాఖ రాజకీయ నాయకులకు శనివారం టెన్షన్..!!

విశాఖపట్నం రాజకీయ నాయకులకు శనివారం వస్తుంది అంటే తెగ టెన్షన్ పడుతున్నారట. శనివారం వచ్చేసరికి ఎలాంటి కబురు వినాల్సి వస్తుందో అని అంతకు ముందు రోజే నిద్రపట్టని పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతగా కలవర పడటానికి గల కారణం చూస్తే… గడిచిన కొద్ది వారాలుగా ప్రభుత్వం ఇస్తున్న షాకే. విశాఖ జిల్లాలో భూ అక్రమాలు ఉపేక్షించే ప్రసక్తి లేకుండా ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో గత మూడు నెలలుగా రెవెన్యూ యంత్రాంగం విశాఖలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వందల కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన వాటిని కాపాడటానికి రంగం సిద్ధం చేసింది.

Andhra retrieves 20 acres encroached land from GITAMఈ క్రమంలో అక్రమాలు నిర్ధారణ అయితే మొదలుకొని రాజకీయ నేత వరకు ఎవరిని వదులుకూడదని హెచ్చరిస్తున్న సర్కార్ దానికి అనుగుణంగానే కూల్చివేతలు స్టార్ట్ చేసింది. ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం అన్నట్టు కాకుండా ఆక్రమణలు చేసిన వారు ఎవరైనా పద్ధతి ఒకటేలా ఉంటుందని… సంకేతాలు పంపుతున్నారు అధికారులు. కాగా కూల్చివేత లకు శనివారం ఏంచుకోవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఇంటి కాంపౌండ్ వాల్ నీ ఆక్రమించి కటేశారు అని చెబుతూ… దానిని కొల్లగొట్టేందుకు అధికారులు ప్రయత్నించారు.

Gitam University Vizag: Demolition in Gitam University creates tension | Visakhapatnam News - Times of India

ఈ క్రమంలో దాని పై ఉన్న న్యాయపరమైన వ్యవహారాలతో కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాత వారం మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటిని ఆనుకుని… ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు అంటూ దాని విలువ మూడు కోట్లు అంటూ… అక్కడి కట్టడాలను తొలగించడంలో పెద్ద హైడ్రామా జరిగింది. ఆ తరువాత వారం ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉన్న షాపులను తొలగించడం జరిగింది. ఆ మరుసటి వారం గీతం యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకున్నారు. 800 కోట్లు అని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ వ్యవహారాలపై రాజకీయ విమర్శలు ఎలా వున్నా…. అధికార విపక్షాలకు చెందిన నాయకుల లెక్కలు మాత్రం పక్క అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రతివారం క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. దీంతో శనివారం వచ్చేసరికి విశాఖలో రాజకీయ నేతలకు ఎవరు వంతు వస్తుందో అన్న టెన్షన్ పట్టుకున్నట్లు టాక్.