Cinema Tickets: వర్మ, నాని మధ్య టామ్ అండ్ జెర్రీ వార్..! సమస్య కొలిక్కొచ్చేనా..?

tom jerry war between rgv and nani
Share

Cinema Tickets: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం సంచలనాలు రేపుతోంది. ఇప్పటివరకూ ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య జరుగుతున్న వార్ కాస్తా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీతో ఒక్కసారిగా విషయం హీటెక్కిపోయింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి నానికి ఓ టీవీ చానెల్ డిబేట్ తోపాటు.. పది ప్రశ్నలతో ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు వర్మ. దీనికి నాని సమాధానాలు ఇవ్వగా.. వర్మ తనదైన స్టయిల్లో కౌంటర్ ఇచ్చారు. మళ్లీ.. వర్మకు మంత్రి నాని ప్రశ్నలు సంధించారు. దీంతో ఇండస్ట్రీ నుంచి ఎవరూ చేయని ధైర్యం వర్మ చేసినట్టైంది. వర్మకు మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ చేయడం విశేషం.

tom jerry war between rgv and nani
tom jerry war between rgv and nani

పరిపాలన బాలేదంటే దిగిపోతారా..?

వీరిద్దరి మధ్యా డిబేట్ సూటిగానూ, విమర్శలు, ప్రతివిమర్శలు లేకుండా జరిగింది. వ్యాపార సూత్రాల ఆధారంగా వర్మ తనదైన స్టయిల్లో ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వగా.. ప్రభుత్వం, ప్రజలు, ప్రజా శ్రేయస్సు నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఓదశలో రేషన్ షాపులు ఉన్నట్టు రేషన్ ధియేటర్స్ కట్టి ప్రజలకు సినిమా చూపిస్తే మీకు ఓట్లు వస్తాయి కదా అని వ్యంగ్యంగా అన్నారు. సినిమా బాగోకపోతే టికెట్ డబ్బులు తిరిగిచ్చేస్తారా..? అని నాని అంటే.. మీ పరిపాలన బాలేదు.. దిగిపోండి అని ప్రజలు అంటే దిగిపోతారా..? అని కౌంటర్ ఇచ్చారు వర్మ. తమకు పవన్ కల్యాణ్సంపూర్ణేష్ బాబు సినిమాల్లో ఏదైనా ఒకటే అని మంత్రి అంటే.. మంత్రిగా మీకూ మీ డ్రైవర్ కు తేడా లేదంటే ఒప్పుకుంటారా..? అని వర్మ కౌంటర్ ఇచ్చాడు.

వార్ కు ఎండ్ కార్డ్ పడుతుందా..?

నేను ఇంజనీరింగ్ చదివాను.. నాకు ఎకనామిక్స్ తెలీదు. కానీ.. మీ ప్రభుత్వంలో అనుభవజ్ఞుడైన ఎకనమిస్ట్ తో డిబేట్ పెడితే వాదించడానికి రెడీ అని వర్మ అన్నారు. చివరగా.. ‘మీతో గొడవలు పడటం మా ఉద్దేశం కాదు. మిస్ అండర్ స్టాండింగ్ వల్ల జరుగుతోంది. మీరు అనుమతిస్తే మిమ్మల్ని కలిసి మా సమస్యలను వివరిస్తా. అప్పుడైనా సరైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని వర్మ కోరగా మంత్రి స్పందిస్తూ.. ‘తప్పకుండా త్వరలో కలుద్దాం అని అన్నారు. మొత్తంగా వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ జరిగిందనే చెప్పాలి. మరి.. వీరిద్దరి భేటీతోనైనా సమస్య ఓ కొలిక్కి వస్తుందేమో చూద్దాం..!


Share

Related posts

‘విశాఖకు అనుకూలంగానే నిర్ణయం’

Mahesh

Nandamuri Bala krishna : బిగ్ బ్రేకింగ్ : బాలకృష్ణ పాదయాత్ర – రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది

somaraju sharma

పవన్ కల్యాణ్ తో జానీ మూవీ..! సెట్ చేసిన రామ్ చరణ్..!!

Muraliak