NewsOrbit
రివ్యూలు

`2 అవ‌ర్స్ ల‌వ్‌` రివ్యూ & రేటింగ్‌

బ్యాన‌ర్‌: శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్
న‌టీన‌టులు: శ్రీప‌వార్‌, కృతిగార్గ్‌, అశోక్ వ‌ర్ధ‌న్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, న‌ర్సింగ్ యాద‌వ్ త‌దిత‌రులు
సంగీతం: గ్యాని
కెమెరా: ప్రవీణ్ వ‌న‌మాలి
ఎడిట‌ర్‌: శ్యామ్
ఆర్ట్‌: వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అఖిల గంజి
కో డైరెక్ట‌ర్‌: ఎం.శ్రీనివాస్ రాజు
నిర్మాణం: శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌
ద‌ర్శ‌క‌త్వం: శ్రీప‌వార్‌

ప్రేమ‌క‌థల్లో ఎమోష‌న్స్ చాలా కీల‌కంగా ఉంటాయి. వాటి గ్రిప్పింగ్‌గా ప్రేక్ష‌కులు మెచ్చేలా ఎలా తెర‌కెక్కించామ‌నేదే కీల‌కం. వెండితెర‌పై ఎన్నో ప్రేమ‌క‌థ‌లు వ‌స్తుంటాయి. అయితే కొన్ని మాత్ర‌మే ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందుతుంటాయి. అందుకు కార‌ణం స‌ద‌రు ద‌ర్శ‌కులు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించ‌డ‌మే. అలాగే ప్రేమ క‌థా చిత్రాల్లో ఉండే ల‌వ్‌, ఎమోష‌న్స్‌ను మిస్ కానీయ‌కుండా చూసుకోవ‌డం. ఇప్పుడు అలాంటి ఓ కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సినిమాయే `2 అవ‌ర్స్ ల‌వ్‌`. శ్రీప‌వార్ హీరోగా, ద‌ర్శ‌కుడిగా త‌న స్నేహితుల‌తో క‌లిసి త‌న‌కు వ‌చ్చిన ఓ ఆలోచ‌న‌ను ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ను రాసుకున్నాడు. దీంతో రూపొందిన ఈ `2 అవ‌ర్స్ ల‌వ్‌` చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థలోకి వెళ‌దాం..

క‌థ‌:
ఇళ్ల‌లోకి చొర‌బ‌డి దొంగ‌త‌నం చేసే దొంగ‌(అశోక్ వ‌ర్ధ‌న్‌) ఓ ఇంట్లోకి దొంగ‌త‌నం కోసం వెళ‌తాడు. అక్క‌డ ఓ అమ్మాయి రాసుకున్న డైరీ దొరుకుతుంది. దాన్ని చ‌దువడం స్టార్ట్ చేస్తాడు. దాంట్లో ఆదిత్‌(శ్రీప‌వార్‌), నైనా(కృతిగార్గ్‌) ప్రేమ క‌థ ఉంటుంది. అది న‌చ్చ‌డంతో ఆ దొంగ రచ‌యిత‌గా మారి.. 2 అవ‌ర్స్ ల‌వ్ అనే పేరుతో పుస్తకం రాసి అచ్చు వేయిస్తాడు. ఆ పుస్త‌కానికి చాలా మంచి పేరు వ‌స్తుంది. అందుకు కార‌ణం ఆదిత్‌, నైనాలు ప్రేమించుకున్న తీరు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. నైనా వేరే పేరుతో ఆదిత్‌ను ప్రేమిస్తుంది. కానీ ప్ర‌తిరోజూ ఇద్ద‌రూ రెండు గంట‌లు మాత్ర‌మే ప్రేమించుకుంటారు. కానీ ఆదిత్‌కు నైనా ప్రేమ జీవితాంతం కావాల‌నుకుంటాడు. అస‌లు నైనా ఎందుకు పేరు మార్చుకుని ఆదిత్‌ను ల‌వ్ చేస్తుంది. అది కూడా రెండు గంట‌లు మాత్ర‌మే ఎందుకు ల‌వ్ చేస్తుంది? వీరిద్ద‌రి వెనుకున్న క‌థేమిటి? డైరీ చ‌దివిన దొంగ ఏం చేస్తాడు? ఆదిత్‌, నైనాల జీవితాల్లో డైరీ కార‌ణంగా చోటు చేసుకునే ప‌రిణామాలేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

స‌మీక్ష‌:
సినిమాకు ప్ర‌ధాన బ‌లం హీరో, ద‌ర్శ‌కుడు శ్రీప‌వార్ అనుకున్న మెయిన్ పాయింట్‌. ఈ పాయింట్ ఏంటో డైరెక్ట‌ర్ ఏమీ దాచిపెట్ట‌లేదు. టైటిల్‌లోనే దాన్ని ముందుగానే రివీల్ చేసేశాడు. `2 అవ‌ర్స్ ల‌వ్‌` అసలు 2 అవర్స్ ల‌వ్ ఏంటో తెలుసుకోవాలనే దానిపై కాస్త ఆస‌క్తిని క్రియేట్ చేశాడు. పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని క‌లిగించాయ‌న‌డంలో సందేహం లేదు. అసలు హీరో, హీరోయిన్ రెండు గంట‌లు మాత్ర‌మే ఎందుకు ప్రేమించుకున్నారు? అస‌లు దాని వెనుక జ‌రిగిన క‌థేంటనే అంశాల‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచాడు శ్రీప‌వార్‌. హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం చేయ‌డ‌మ‌నేది కాస్త క‌ఠిన‌త‌ర‌మైన విష‌య‌మే. అయినా కూడా శ్రీపవార్ సినిమాను తెర‌కెక్కించిన తీరు చూస్తే అభినందించాల్సిందే. హీరో, హీరోయిన్ పాత్ర‌ల‌ను చ‌క్క‌గా డిజైన్ చేశాడు. ఏదో చేయాల‌ని ఏదో చేసినట్లు సినిమాలో అనిపించ‌దు. శ్రీప‌వార్ ప‌క్కా క్లారిటీతో సినిమాను తెర‌కెక్కించాడు. అస‌లు ద‌ర్శ‌కత్వంలో ఎలాంటి అనుభవం లేని వ్య‌క్తి సినిమాను తెర‌కెక్కించిన తీరు చూస్తే ఆశ్చ‌ర్య‌ప‌డ‌తాం. చాలా క్లియ‌ర్‌గా అనిపిస్తుంది. ఇక గ్యాని సంగీతం, నేప‌థ్య సంగీతం సినిమాకు మ‌రో పిల్ల‌ర్‌గా నిల‌బ‌డ్డాయి. అలాగే ప్ర‌వీణ్ వ‌న‌మాలి సినిమాటోగ్ర‌ఫీ సింప్లీ సూప‌ర్బ్‌. మినిమం బ‌డ్జెట్ చిత్రానికే ఈ రేంజ్ సినిమాటోగ్ర‌ఫీ ఇవ్వ‌డం గొప్ప విష‌యం. క‌థ‌కు సంబంధం లేని రెండు, మూడు స‌న్నివేశాలు, సెకండాఫ్ కాస్త సాగ‌దీత‌గా అనిపించ‌డం మిన‌హా సినిమా బావుంది. కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌ల‌ను చూడాల‌నుకునే వారికి త‌ప్ప‌కుండా న‌చ్చే సినిమా.
సినిమాలో లోటు పాట్లు విష‌యానికి వ‌స్తే.. ఎంచుకున్న పాయింట్ కొత్త‌గా ఉన్న‌ప్ప‌టికీ మ‌రింత ఎమోష‌న‌ల్ కంటెంట్‌ను యాడ్ చేసుంటే బావుండేద‌నిపించింది. ఎమోష‌న్‌లో మ‌రింత డెప్త్ ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌నిపించింది. ఇక ఫ‌స్టాఫ్‌లో హీరోయిన్ చుట్టూ తిరిగే విల‌న్ గ్యాంగ్ తిర‌గ‌డం, ఆమెను చంపాల‌ని చూడ‌టం.. దానికి అనుగుణంగా న‌డిచే స‌న్నివేశాలు అన్నీ క‌థ‌కు సంబంధం లేని అంశాలుగా అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ వ్య‌వ‌థి కాస్త ఎడిట్ చేసుంటే సినిమాలో మ‌రింత స్పీడుగా ఉండేది. ప్రేక్ష‌కుడికి మ‌రింత బాగా న‌చ్చేది. అశోక్ వ‌ర్ధ‌న్ కామెడీ డోసు ఎక్కువైన‌ట్లుగా అనిపించింది.

బోట‌మ్ లైన్‌: 2 అవ‌ర్స్ ల‌వ్‌… కొత్త ప్ర‌య‌త్నం
రేటింగ్‌: 3/5

Related posts

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Leave a Comment