NewsOrbit
OTT రివ్యూలు సినిమా

Meet Cute: మీట్ క్యూట్ రివ్యూ.. అంతా క్యూటేనా.!?

Meet Cute web series review

Meet Cute: హీరో గానే కాదు నిర్మాతగాను కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటారని పేరు ఉంది నానికి.. తన సోదరి దీప్తిని దర్శకురాలుగా పరిచయం చేస్తూ ప్రశాంత్ త్రిపర్నేని తో కలిసి ఆయన మీట్ క్యూట్ వెబ్ సిరీస్ ను నిర్మించారు.. ఈ వెబ్ సిరీస్ లో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండడం, నాని సోదరి డైరెక్షన్ చేశారని తెలియడంతో ఈ సిరీస్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.. సోనీ లీవ్ లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది.!? కొత్త దర్శకురాలు నాని సోదరి దీప్తి ప్రేక్షకులను మెప్పించారా.!? ఈ వెబ్ సిరీస్ నిజంగా క్యూట్ గా ఉందా.!?

Meet Cute web series review
Meet Cute web series review

కథ:
ఐదు విభిన్న కథల సమాహారమే మీట్ క్యూట్.. ఒక కథ తో మరొక కథ కి సంబంధం ఉండదు. మొదటి కథ మీట్ ది బాయ్.. ఎంబీఏ చదవాలనుకున్న అమ్మాయి తల్లి బలవంతం మీద పెళ్లి చూపులకు వెళ్లడం. ఓ డీల్ కుదుర్చుకోవడం ప్రదానాంశం. రెండో కథ ఓల్డ్ ఇస్ గోల్డ్.. లో ఓ అమ్మాయికి పాస్ పోర్ట్ ఆఫీస్ లో ఓ ముసలాయనదో పరిచయం ఏర్పడుతుంది. ఆయనతో మాటలు కలిసాక జీవితం యొక్క పరమార్థం ఏంటో అర్థం అవుతుంది. ఇక మూడవ కథ విషయానికి వస్తే ఇన్ లా లవ్.. ఒక తల్లి తన కొడుకు ఓ అమ్మాయిని ఓ డాగ్ కేర్ హౌస్ లో దించడం చూస్తుంది. అక్కడికి వెళ్లి అమ్మాయితో పరిచయం చేసుకొని తన విషయాలు తెలుసుకున్న తర్వాత చివరికి ఆ అమ్మాయిని తన కోడలిగా ఆహ్వానిస్తుంది. స్టార్ స్ట్రక్ నాలుగవ కథ. అవార్డు ఫంక్షన్ కి వెళ్తున్న అందాల తార షాలిని కార్ జోరున వాన లో ఆగిపోతుంది. తనకి ఆమన్ లిఫ్ట్ ఇస్తాడు. షాలిని హీరోయిన్ అని తెలియని అతను తన మనసులో ఉన్న భావాలను ఆమెతో పంచుకుంటాడు. ఇక ఫైనల్ గా ఐదవ కదా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఓ ఆత్మ వచ్చి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ భార్యతో మాట కలుపుతుంది అతని గొప్పదనం చెప్పి మాయమవడంతో ఈ వెబ్ సిరీస్ ముగుస్తుంది..

నటీనటులు నటన..
ఈ వెబ్ సిరీస్ లో ఆదాశర్మ, రూహాని శర్మ, వర్షా బొల్లమ్మ, సత్యరాజ్, రోహిణి, ఆకాంక్ష సింగ్, అశ్విని కుమార్ లక్ష్మీ కాంతన్, శివ కందుకూరి రాజ్ చెంబోలు, సునయన తదితరులు నటించారు. ఇందులో వర్షా బొల్లమ్మ స్వాతి పాత్రలో నటించింది. ఇది వెబ్ సిరీస్ లో నటించిన వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు ఒక్కో వెబ్ సిరీస్ లో ఒక్కొక్కరుగా కనిపిస్తూ ఉంటారు. ఈ సిరీస్ లోని కథలు పాతగానే అనిపిస్తాయి కానీ ప్రతి కథలోనూ వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు ఇక సిచువేషన్ కి అనుగుణంగా ఈ వెబ్ సిరీస్ లో మూడు పాటలు రాశారు సందర్భానుసారంగా వచ్చిన పాటలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి ఈ వెబ్ సిరీస్ లో దీప్తిగంట ప్రతిభను కచ్చితంగా మెచ్చుకోవాలి. మొదటిసారి దర్శకత్వం చేసినా కానీ అద్భుతమైన రీతిని కనబరిచారు. ఆమె ప్రయత్నానికి తగ్గట్టుగానే నిర్మాతలు కూడా ఖర్చు చేశారు. సరదాగా చూడడానికి ఈ మీట్ క్యూట్ లకు వెళితే కొన్ని అంశాలైన మన జీవితాలలోని కనిపిస్తాయి. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ చక్కగా చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ అందరినీ అలరిస్తుంది..

ప్లస్ పాయింట్స్;
కథ, కామెడీ, డైలాగ్స్, సమయానికి అనుగుణంగా వచ్చే పాటలు.

మైనస్ పాయింట్స్:
రొటీన్ సీన్స్, సాగదీత.

చివరిగా.. ఈ వెబ్ సిరీస్ కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే క్యూట్ గా అనిపించాయి అన్నీ కాదు..

author avatar
bharani jella

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri