NewsOrbit
రివ్యూలు

`నువ్వు తోపురా` రివ్యూ

చిత్రం :  నువ్వు తోపు రా
ఆర్టిస్టులు : సుధాక‌ర్ కోమాకుల‌, నిత్యాశెట్టి, నిరోషా, ర‌వివ‌ర్మ‌, శ్రీధ‌ర‌న్‌, దివ్యా రెడ్డి, జెమిని సురేష్‌, దువ్వాసి మోహ‌న్‌, ఫిష్ వెంకట్‌, కల్ప‌ల‌త‌, ప‌ద్మ‌జ‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాకేష్‌, మ‌హేష్ విట్టా, సిండీ పెరెజ్‌, జ్యారెడ్ బ్రాస‌న్‌, డౌసీ పియెద్రా, అన‌నోఖ్‌, శ్రీని కొల్ల‌, దీప‌క్ రావెళ్ల‌, రాజ్ ఆనందేసి, క్లేర్ బ్రౌన్‌, ఎడ్మండ్ రోజ త‌దిత‌రులు
ప్రెజెంట్స్:   బేబీ జాహ్న‌వి
బ్యాన‌ర్‌:  యునైటడ్ ఫిలింస్, స్‌.జె.కె.ప్రొడక్ష‌న్స్ (యు.ఎస్‌.ఎ)
డైర‌క్ష‌న్‌:  హ‌రినాథ్ బాబు.బి
ప్రొడ్యూస‌ర్ :డి.శ్రీకాంత్
స్టంట్స్‌:  విజ‌య్ మాస్ట‌ర్‌, డుయ్ బెక్
కెమెరా:  ప్ర‌శాష్ వేలాయుదం, వెంక‌ట్ సి.దిలీప్‌
 ఆర్ట్‌:  జెక్ జంజ‌ర్‌
ఎడిట‌ర్:  ఎస్.బి ఉద్ధ‌వ్‌
 మ్యూజిక్ :  సురేష్ బొబ్బ‌లి
తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరోలకు, ఆ త‌ర్వాత కూడా స‌రైన హిట్లు ప‌డాలి. అలా కాకుండా వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తే ఎక్క‌డో తేడా జ‌రిగిన‌ట్టే. సుధాక‌ర్ కోమాకుల విష‌యంలోనూ ఏదో తేడా జ‌రిగింది. ఆయ‌నకు తొలి సినిమా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌` ప‌డింది. అందులో తెలంగాణ యాస మాట్లాడే హీరోగా ఆయ‌న త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. నాగ‌రాజు అనే ఆ పాత్ర‌కు ప్రేక్ష‌కుల్లో చాలా మంచి స్పంద‌న కూడా వ‌చ్చింది. అయితే  ఆ త‌ర్వాత వ‌చ్చిన రెండు సినిమాలు మాత్రం ఆయ‌న‌కు అనుకున్నంత క్రేజ్ తెచ్చిపెట్ట‌లేదు. అందుకేనేమో ఆయ‌న మ‌ళ్లీ తెలంగాణ యాస మాట్లాడారు. `నువ్వు తోపురా` సినిమా కోసం. ఎక్కువ భాగాన్ని విదేశాల్లో చిత్రీక‌రించిన ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ సినిమా ఎలా ఉంది?  ఎంతో చిత్రాన్ని న‌మ్మిన సుధాక‌ర్‌కు ఎలాంటి హిట్ అవుతుంది… లెట్స్ సీ..
క‌థ‌
స‌రూర్ న‌గ‌ర్ సూరి (సుధాక‌ర్ కోమాకుల‌) బిందాస్ జీవితాన్ని గ‌డుపుతాడు. తండ్రిని చిన్న‌తంలో పోగొట్టుకున్న అత‌నికి జీవిత‌మంటే డ‌ప్పు కొట్టే తాత‌, ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకున్న డ‌ప్పు, దోస్తులు అంతే. ఎప్పుడూ జీవితాన్ని సీరియ‌స్గా తీసుకోడు అని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నంగా అత‌నికి కొన్ని అరియ‌ర్స్ కూడా ఉంటాయి. క‌న్న త‌ల్లి (నిరోషా), చెల్లెలిని పెద్ద‌గా ప‌ట్టించుకోడు సూరి.  తొలిచూపులోనే బీటెక్ చ‌దివిన ర‌మ్య‌ను ఇష్ట‌ప‌డ‌తాడు. ప‌ర‌స్ప‌రం ప్రేమించుకున్నాక ర‌మ్య అమెరికా వెళ్తుంది. సూరి ఎంత‌గానో అభిమానించిన తాత దూర‌మ‌వుతాడు. ఆయ‌న అంతిమ‌యాత్ర‌లో సూరి వాయించిన డ‌ప్పు విన్న ఓ మీడియేట‌ర్ సూరిని అమెరికాకు తీసుకెళ్లి క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తాన‌ని చెబుతాడు. అయితే సూరి ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల ఇబ్బందిప‌డ్డ అమెరికా తెలుగు అసోసియేష‌న్ ప్రెసిడెంట్లు అత‌న్ని ఎంక‌రేజ్ చేయ‌రు. ఆ త‌ర్వాత ఏమైంది?  సూరి జీవితంలో ఎలాంటి మార్పులు వ‌చ్చాయి?  త‌ల్లి విలువ‌, చెల్లి విలువ తెలుసుకున్నాడా?  లేదా?  అత‌ని జీవితంలోకి వ‌చ్చిన మంచి వాళ్లు ఎవ‌రు?  చెడ్డ వాళ్లు ఎవ‌రు?  అనేది ఆస‌క్తిక‌రం.
ప్ల‌స్ పాయింట్లు
– పాట‌లు బావున్నాయి
– సూరి పాత్ర‌లో సుధాక‌ర్ ఒదిగిపోయాడు
– లొకేష‌న్లు బావున్నాయి
మైన‌స్ పాయింట్లు
– క‌థ ఇంప్రెసివ్‌గా లేదు
–  స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుడు పెద్ద క‌నెక్ట్ కాడు
– స్క్రీన్‌ప్లేలో కొత్త‌ద‌నం లేదు
విశ్లేష‌ణ‌
హీరో న‌మ్మినంత గొప్ప‌గా సినిమాను ద‌ర్శ‌కుడు తీయ‌లేదేమోన‌ని అనిపిస్తుంది. స‌రూర్‌న‌గ‌ర్ సూరి, బేవ‌ర్స్ గా తిరిగే పాత్ర వ‌ర‌కు జ‌నాలు క‌నెక్ట్ అవుతాడు. ఇక్క‌డి నుంచి అమెరికా వెళ్లి అక్క‌డ ఇబ్బందులు ప‌డ్డ యువ‌కుడి క‌థ‌ను చెప్ప‌డం వ‌ర‌కు బాగానే ఉంది. కానీ అనూహ్యంగా అత‌నికి ప‌రిచ‌య‌మైన వారు, వాళ్ల ప్ర‌వ‌ర్త‌న వంటివ‌న్నీ పెద్ద‌గా మింగుడు ప‌డ‌వు. హెచ్ ఒన్ వీసా కోసం హీరో ప్ర‌వ‌ర్తించిన విధానం కూడా పెద్ద‌గా మెప్పించ‌దు. క‌ర‌డుగ‌ట్టిన డాన్‌ల‌ను చూపించిన‌ట్టు కొన్ని కేర‌క్ట‌ర్ల‌ను చూపించి, వారేదో గ‌బుక్కున అతి చిన్న విష‌యాల‌కే అవ‌త‌లివారితో స్నేహ‌పూర్వ‌కంగా మారిన‌ట్టు చూపించ‌డం అంత క‌న్విన్సింగ్‌గా లేదు. హీరో చేసే ప్ర‌య‌త్నాలు కూడా ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు. పైగా స్క్రీన్ ప్లే ఎక్క‌డా ఆస‌క్తిక‌రంగా సాగ‌దు. వ‌రుణ్ సందేశ్ పాత్ర వ‌ల్ల ఏదో ఆఖ‌రున ఒక చిన్న ట్విస్ట్ క‌నిపించే కానీ, అంత‌కు మించి అత‌ని పాత్ర వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం కూడా లేదు. స్పూన్ కామెడీ త‌ప్ప పెద్ద‌గా అత‌ను సినిమాకు హెల్ప్ కూడా ఏమీ కాలేదు. డైలాగులు బావున్నాయి. నిరోషా పాత్ర క‌నిపించిన‌ప్పుడ‌ల్లా `వామ్మో.. సెంటిమెంట్‌` అన్న‌ట్టు అనిపిస్తుంది. డైలాగులు, లొకేష‌న్లు, అక్క‌డ‌క్క‌డా పాట‌ల ప‌ల్ల‌వుల విష‌యంలో తీసుకున్న జాగ్ర‌త్తను ద‌ర్శ‌కుడు సినిమా క‌థ, క‌థ‌నం విష‌యంలో తీసుకుంటే ఇంకా బావుండేది
రేటింగ్‌: 1.5
బాట‌మ్ లైన్‌:  సినిమా తోపేం కాదు…

Related posts

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Leave a Comment