NewsOrbit
రివ్యూలు

`రాక్ష‌సుడు` రివ్యూ

బ్యాన‌ర్‌ :  ఎ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌
ఆర్టిస్టులు:  బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, దువ కౌశిక్‌, రాజీవ్ క‌న‌కాల‌, కాశీ విశ్వ‌నాథ్ , శ‌ర‌వ‌ణ‌న్‌, వినోద్ సాగ‌ర్‌, వినోదిని వైద్య‌నాథ‌న్‌, అమ్ము అభిరామి, సూర్య‌, రాధా ర‌వి, కేశ‌వ్ దీప‌క్‌, సుజానీ జార్జి త‌దిత‌రులు
మ్యూజిక్‌:  గిబ్ర‌న్‌
డైలాగ్స్ :  సాగ‌ర్‌
స్టోరీ – స్క్రీన్‌ప్లే:  రామ్‌కుమార్‌
కెమెరా:  వెంక‌ట్ సి.దిలీప్‌
ఆర్ట్:  గాంధీ
ఎడిట‌ర్‌:  అమ‌ర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కొడాలి ముర‌ళీకృష్ణ‌
ఫైట్స్:  వెంక‌ట్, విక్కీ
డైర‌క్ష‌న్‌:  ర‌మేష్ వ‌ర్మ పెన్మెత్స‌
ప్రొడ్యూస‌ర్‌:  కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌

ఓ జ‌బ‌ర్ద‌స్త్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. `నేను ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఐదేళ్లు పూర్త‌యింది. ఇన్ని రోజులూ నేను చేసిన సినిమాల‌న్నీ ఒక ఎత్తు. తాజాగా చేస్తున్న `రాక్ష‌సుడు` ఒక ఎత్తు. ఈ సినిమాను నేను నా తొలి చిత్రంగా భావిస్తున్నా. గ‌తంలో కొన్ని త‌ప్పులు చేశాను. ఇక‌పై ఆ త‌ప్పులు రిపీట్ చేయ‌ను` అని ప్రీ రిలీజ్ వేడుక‌లో చెప్పాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఆయ‌న న‌టించిన `రాక్ష‌సుడు` సినిమాను చూసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ త‌మిళంలో విష్ణు విశాల్‌క‌న్నా ఇత‌నే బాగా చేశాడ‌ని చెప్పార‌ట‌. త‌మిళంలో హిట్ మూవీ రాక్ష‌స‌న్‌కు రీమేక్‌గా రూపొందిన రాక్ష‌సుడు నిజంగా అంత బావుందా?  తెలుగు జ‌నాల‌ను ఆక‌ట్టుకుంటుందా?  రివ్యూలోకి వెళ్దాం.

క‌థ‌
పోలీస్ ఆఫీస‌ర్ అరుణ్ కుమార్ (బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్‌) డిపార్ట్ మెంట్‌లో జాయిన అయిన కొన్నాళ్ల‌కే 15 ఏళ్ల అమ్మాయిలు ఇద్ద‌రు క‌నిపించ‌కుండా పోయి, ఆనవాళ్లు క‌నిపించ‌నంత‌గా చితికిపోయి క‌నిపిస్తారు. ఆ కేసులో ఉన్న క్లూల‌ను బ‌ట్టి, వాళ్ల‌వి సీరియ‌ల్ హ‌త్య‌ల‌ని అర్థం చేసుకుంటాడు అరుణ్‌. ఆ విష‌యాన్ని ఏసీపీ ల‌క్ష్మి(సుజానే జార్జి)తో చెబుతాడు. అయితే ఆమె ఈగోతో అత‌ని మాట‌ల‌ను పెడ‌చెవిన పెడుతుంది. ఆమె టీమ్ కూడా అత‌న్ని న‌మ్మ‌దు. కానీ ఒకానొక కేసులో ఓ కీచ‌క ఉపాధ్యాయుడి చేతి నుంచి టీమ్‌లో ఉన్న పోలీస్ వెంక‌ట్‌ని కాపాడుతాడు అరుణ్‌. దాంతో వెంక‌ట్‌కి అరుణ్ మీద గురి కుదిరి అత‌నికి సాయం చేస్తాడు. ఇంత‌లోనే అరుణ్ స‌స్పెండ్ అవుతాడు.ఆ స‌మ‌యంలోనే అత‌ని మేన‌కోడ‌లు సిరి (అమ్ము అభిరామి) మాయ‌మైపోతుంది. అరుణ్ అక్క బావ‌లు (వినోదిని, రాజీవ్ క‌న‌కాల‌) దిగులు చెందుతారు. కేసును సీరియ‌స్‌గా డీల్ చేస్తాడు అరుణ్‌. ఆ క్ర‌మంలో అత‌నికి టీచ‌ర్  కృష్ణ‌వేణి (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) తోడుగా ఉంటుంది. అయితే ఈ కేసు వ‌ల్ల కృష్ణవేణి అక్క కూతురు కావ్య (దువా కౌశిక్‌) అపాయంలో ప‌డుతుంది. ఆమెను కిడ్నాప్ చేసిన `అన్నా బెల్లి జార్జి ఎవ‌రు?  అత‌నికి మిగిలిన అమ్మాయిల హ‌త్య‌ల‌కు ఉన్న సంబంధం ఏంటి? అత‌నికి మేజిక్ ఎలా తెలుసు?  హార్మోన్ల లోపం వ‌ల్ల అత‌నిలో ఏర్ప‌డ్డ లోపం ఎలాంటిది వంటివ‌న్నీ సెకండాఫ్‌లో, క్లైమాక్స్ లో తెలిసే విష‌యాలు.
స‌మీక్ష
త‌మిళంలో విడుద‌లైన `రాక్ష‌స‌న్‌`ను య‌థాత‌థంగా తెర‌కెక్కించారు. అక్క‌డికీ, ఇక్క‌డికీ భ‌యానక దృశ్యాల‌ను చూపించ‌డంలోనూ ఏమాత్రం బేధం లేదు. త‌మిళ సినిమా చూడ‌ని వారికి, ఫ్రెష్‌గా ఈ సినిమా చూసేవారికి బాగానే క‌నెక్ట్ అవుతుంది. అయితే ఈ సినిమా ఒక వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే. తెర‌మీద హింస ఉండ‌టం వేరు.. జుగుప్స ఉండ‌టం వేరు. కొన్ని దృశ్యాలు చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. అందుకు కెమెరా, మేక‌ప్ డిపార్ట్ మెంట్ ఎంత కృషి చేశాయో, అంతే కృషి జిబ్రాన్ కూడా చేశారు. ఆయ‌న చేసిన రీరికార్డింగ్ బాగా ఎలివేట్ అయింది. లైటింగ్ బావుంది. స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా, ద‌ర్శ‌కుడు కావాల‌న్న క‌ల‌తో ర‌గిలే యువ‌కుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా చేశారు. అనుప‌మ‌కు న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేక‌పోయినా, ఉన్నంత‌లో బాగా చేసింది. క‌న్న కూతురిని శవంగా చూసుకున్న సంద‌ర్భంలో రాజీవ్ క‌న‌కాల న‌ట‌న కంట‌త‌డి పెట్టిస్తుంది. మిగిలిన వారు కొత్త‌వారైనా బాగా చేశారు. ఏసీపీ ల‌క్ష్మీ యాటిట్యూట్ తో మెప్పించింది. కాశీ విశ్వ‌నాథ్ మంచివైపు నిల‌బ‌డే కానిస్టేబుల్‌గా క‌నిపించారు. ర‌మేష్ వ‌ర్మ బాగా డీల్ చేశారు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా స‌క్సెస్ అయిన‌ట్టే. కాక‌పోతే ఇది యూనివ‌ర్శ‌ల్ స‌బ్జెక్ట్ కాదు. ఇలాంటి హింస‌ను భ‌రించ‌గ‌లిగేవాళ్లకు, థ్రిల్ల‌ర్స్ ను ఎంజాయ్ చేసే వారికి మాత్రం బాగా క‌నెక్ట్ అవుతుంది. స‌ర‌దాగా న‌వ్వుకోవ‌డానికో, ఫ్యామిలీ ఎమోష‌న్స్, కుటుంబ విలువ‌లు గురించి చూడాల‌నుకునోవారికో త‌గ్గ సినిమా కాదు. క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పాల్సిన టీచ‌ర్ చెడుదారి ప‌డితే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. అలాగే క‌న్న‌తండ్రి పశువుగా మారితే, అత‌న్ని హ‌త‌మార్చ‌డానికి త‌ల్లి ఎలా ఆరాట‌ప‌డిందో కూడాచూపించారు. స‌మాజంలో నిత్యం వినే, అంశాల‌తో అల్లుకున్న క‌థ ఇది. రీమేక్ పరంగానూ న్యాయం చేశార‌ని చెప్పొచ్చు.
రేటింగ్‌: 2.75/5
బాట‌మ్ లైన్‌:   సీరియ‌ల్ కిల్ల‌ర్‌.. `రాక్ష‌సుడు`

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment