Corona: కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతున్న తరుణంలోనే బ్లాక్ ఫంగస్ , వైట్ ఫంగస్, యెల్లో, రోజ్ కలర్ ఫంగస్ కేసులు కూడా ఇటీవల నమోదయ్యాయి. ఫంగస్ల పేరుతో ముప్పు మనల్ని ముంచెత్తుతుండటం అనేకమందిని కలవరపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలోనే వచ్చిన ఈ ఫంగస్ల వల్ల అనేకమంది ఇబ్బందుల పాలయ్యారు. ఓ వైపు టెన్షన్ కొనసాగుతుంటూ మరోవైపు తాజాగా ఇంకో ఫంగస్ వచ్చిపడింది.
Read More: Corona: చైనా సంచలన వార్నింగ్… కరోనాను ప్రపంచానికి అంటించిందే కాకుండా…
గ్రీన్ ఫంగస్ పేరుతో….
ఇండియాలో ఇప్పుడున్న ఫంగస్ ల పరంపరకు కొనసాగింపుగా (!) అన్నట్లుగా ఇంకో ఫంగస్ బయటపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాక ఫంగస్ ఇన్ఫెక్షన్తో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పరీక్షలు నిర్వహించగా ఆ వ్యక్తికి సైనస్, ఊపిరితిత్తుల్లో గ్రీన్ ఫంగస్ కనిపించిందని డాక్టర్లు నిర్ధారించారు. 90శాతం గ్రీన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో నిండిపోయిందని వైద్యులు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కంటే ఈ గ్రీన్ ఫంగస్ ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరించడం గమనార్హం.
Read More: Corona: షాక్ః కరోనా టీకా డోసుల మధ్య గ్యాప్ ప్రమాదకరమట…
కొంచెం గ్యాప్ ఇవ్వండి…
కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ తో పాటుగా వైట్, యెల్లో మరియు రోజ్ ఫంగస్ కేసులు కనిపించడం అనేకమందిని ఆందోళనకు గురిచేస్తుంటే తాజాగా మరో ఫంగస్ తెరమీదకు రావడం , అది మునుపటి వాటి కంటే ప్రమాదకరమని తేలడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏంటీ ఫంగస్‌లు? ఎందుకు ఒకదాని తర్వాత మరొకటి ఫంగస్‌లు వస్తున్నాయి? ఈ ఫంగస్లకు పరిష్కారం లేదా అంటూ వాపోతున్నారు.