సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లను డిజిటల్ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్ చేసేందుకు హాట్ స్టార్ హక్కులను కలిగి ఉందన్న విషయం విదితమే. ఐపీఎల్ మ్యాచ్‌లు స్టార్ టీవీలో, హాట్ స్టార్ యాప్‌లో ప్రసారం కానున్నాయి. అయితే చాలా మందికి హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ లేదు. దాన్ని ఉచితంగా పొందాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే వీఐపీ ప్లాన్ అయితే ఏడాదికి రూ.399 అవుతుంది అదే ప్రీమియం ప్లాన్ అయితే ఏడాదికి ఏకంగా రూ.1499 వరకు చెల్లించాలి. కానీ కింద తెలిపిన సూచనలు పాటిస్తే హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగానే పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
రిలయన్స్ జియోకు చెందిన రూ.401 జియో క్రికెట్ ప్యాక్ లేదా రూ.598, రూ.777, రూ.2599, రూ.499 క్రికెట్ ప్యాక్ లలో ఏ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్నా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే ఆ సబ్స్క్రిప్షన్ కంటిన్యూ అవ్వాలంటే ముందు తెలిపిన ప్లాన్లలో ఏదో ఒక ప్లాన్‌ను ఎప్పటికప్పుడు రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక రిలయన్స్ జియో ఫైబర్ ను వాడేవారు రూ.999, రూ.1499, రూ.2499, రూ.3999 ప్లాన్లలో ఏదో ఒక ప్లాన్‌ను తీసుకున్నా హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు. వీటికి ఇదే కాకుండా సోనీ లివ్, వూట్, జీ5 వంటి ఇతర యాప్‌లకు చెందిన సబ్స్క్రిప్షన్ లు కూడా ఉచితంగా లభిస్తాయి.
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.599, రూ.448, రూ.2698 ప్లాన్లను రీచార్జి చేసుకుంటే ఉచితంగా హాట్ స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు.
ఇక చివరిగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు తమ వద్ద ఉన్న సూపర్ కాయిన్స్ తోనూ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులకు సూపర్ కాయిన్స్ లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఆ కాయిన్స్‌ను రిడీమ్ చేసుకోవడం ద్వారా హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. అందుకు గాను ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోకి వెళ్లి అందులో ఉండే సూపర్ కాయిన్ జోన్లో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు. దీనికి 399 సూపర్ కాయిన్స్ ఖర్చవుతాయి. ఆ మొత్తం మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్లో ఉంటే వెంటనే హాట్ స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు.