NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

పీసీసీ పీఠంపై రేవంత్ రెడ్డి … జ‌గ్గారెడ్డి ఇదే చెప్తున్నారా?

revanth reddy plans to form a new political party

తెలంగాణ కాంగ్రెస్ అంటేనే అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌కు , ఎత్తుగ‌డ‌ల‌కు పెట్టింది పేరు. అలాంటి తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త ర‌చ్చ తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక. తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేప‌థ్యంలో నూత‌న ర‌థ‌సార‌థి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకొని అధిష్టానానికి ప్ర‌తిపాద‌న‌లు ఇచ్చారు. దీనిపై ర‌చ్చ జ‌రుగుతోంది.

revanth reddy plans to form a new political party

ఆయ‌న‌కే పీసీసీ పీఠం

తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌థి విష‌యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ అభిప్రాయాల స్వీక‌రించి ఐదుగురు నేతల పేర్లు ఫైనల్ చేసిన‌ట్లు స‌మాచారం. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం , ఈ నెలాఖరులో కొత్త పీసీసీ చీఫ్‌పై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అయితే, దీనిపై అప్పుడే కాంగ్రెస్ నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి త‌న‌దైన శైలిలో ఫైర‌య్యారు. ఫైనల్‌ లిస్ట్‌లో తన పేరు లేదన్న లీక్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

రేవంత్ రెడ్డి పేరు ఖ‌రారు?

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించిన లిస్ట్‌లో నాపేరు అధిష్టానం వద్ద చర్చకు లేకపోవడం దురదృష్టకరమైన విషయమని జ‌గ్గారెడ్డి వాపోయారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఆఫీసుకి మెసేజ్ మరియు మీడియా ద్వారా తన ఆవేదన జగ్గారెడ్డి తెలియజేశారు. 2017 సంవత్సరంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ కోసం భారీ బహిరంగ సభ కార్యక్రమం నాకు అప్పగించినప్పుడు.. ఆ కష్ట కాలంలో నేను కోట్ల రూపాయలు పెట్టి సభ నిర్వహించానన్నారు.. అయినా నాపేరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు చర్చలో పోకవడం నాకు చాలా బాధ కలిగించిందన్నారు. ఈ రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇంఛార్జ్ ఈ కార్యక్రమల గురించి తెలుసుకోకపోవడం, నాలాంటి ఆర్గనైజర్ పేరు ఢిల్లీ లిస్ట్‌లో పంపకపోవడం చాలా బాధకు గురిచేసిందని తన ప్రకటనలో జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ పదవిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని జగ్గారెడ్డి అన్నారు. అయితే, ఇప్ప‌టికే పీసీసీ పీఠం రేవంత్ రెడ్డి కి ఖ‌రారు అయింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ్గారెడ్డి చేస్తున్న కామెంట్లు దీనికి బ‌లం చేకూరుస్తున్నాయ‌ని అంటున్నారు.

author avatar
sridhar

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N