హనీ కాంపిటీషన్లో గెలవడం అంత ఓ కలలా ఉంది బాబాయ్ నాకు అని సామ్రాట్ అంటాడు.. హనీ తన ప్రైజ్ ను వాళ్ళ డాడీ తో చూపిస్తూ.. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ.. ప్రైస్ కంటే కూడా తులసి ఆంటీ తో కలిసి స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది.. ఈ ప్రైస్ నేను పట్టుకొని డాన్స్ వేస్తున్నాను.. అదే మా ఫ్రెండ్స్ అయితే నాకు ప్రైస్ వచ్చిందని నన్ను పైకెత్తి మరీ డాన్స్ చేస్తున్నారు అని హనీ ఆనందంగా నవ్వుతుంది..! హనీ కళ్ళల్లో ఆనందం చూసి సామ్రాట్ ఆశ్చర్యపోతాడు..!
బాబాయ్ హనీ కళ్ళల్లో ఈ ఆనందం చూశావా.. ఒకప్పుడు హనీ నవ్వేది కానీ ఆ నవ్వులో ఎప్పుడు ఇంత ఆశ్చర్యం కలగలేదు.. నిజమైన ఆనందాన్ని హనీకి తులసి అందించింది బాబాయ్. ఈరోజు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.. తులసి ని చూసి తప్పుగా అనుకున్నాను.. కానీ ఆమె లాంటి వ్యక్తిత్వం ఉన్నవారు ఇంకొకరు ఉండదని నాకు అర్థమైంది.. ఆమె వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది బాబాయ్ అని సామ్రాట్ అంటాడు.. నువ్వు ఇంత ఆనందంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఒకటి అడగనా అని వాళ్ళ బాబాయ్ అంటాడు ఏంటి బాబాయ్ అని అంటాడు.. నువ్వు ఒక స్త్రీ గురించి ఇంత సంతోషంగా మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.. నువ్వు నీ జీవితం గురించి కూడా ఆలోచించు నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవాలి సామ్రాట్ అని అంటాడు.. నాకు పెళ్ళేంటీ బాబాయ్.. అయినా ఈ వయసులో పెళ్లెందుకు అని నవ్వుకుంటూ సామ్రాట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
తులసి వాళ్ళ ఇంటికి నందు, లాస్య ఇద్దరు వెళ్తారు.. వీళ్ళు ఎందుకు వచ్చారు అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు.. ఎప్పటిలాగే గొడవ పెట్టుకోవడానికి వచ్చారు అని అంటారు పరంధామయ్య.. కానీ ఈసారి తులసి వాళ్ళని గుమ్మంలోనే నిలబెట్టి చడమడ వాయిస్తుంది. మేము మీ ఇంటికి సామ్రాట్ కంపెనీ నుంచి ఒక హైయర్ అఫీషియల్ పొజిషన్స్ లో వచ్చాము అని నందు అంటాడు.. అయితే మర్యాదపూర్వకంగా మాట్లాడుతాను అంటే లోపలికి రండి లేదు అంటే మీరు వెళ్లిపోవచ్చు.. నేను సామ్రాట్ కి బిజినెస్ పార్టనర్ ని అని తులసి ధైర్యంగా చెబుతుంది.. తులసి గారు నేను మీ మ్యూజిక్స్ స్కూల్ కి సంబంధించిన ప్లాన్ ను రెడీ చేశాను.. మీరు చూసి ఓకే అంటే ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామని నందు అంటాడు..
నందు తన డిజైన్ మొత్తం తులసికి వివరించి చెబుతాడు.. మీకు నచ్చిందా మేడం అని నందు అడగగానే.. నువ్వు ఇంత చక్కగా ఎక్స్ప్లనేషన్ చేశాక ఎందుకు నచ్చకుండా ఉంటుంది అని లాస్య అంటుంది.. తులసి వెంటనే నాకు ఈ ప్లాన్ నచ్చలేదు అని చెబుతుంది.. మీరు సంగీతం స్కూల్ పక్కన మిగతా బిజినెస్ లు అన్ని పెట్టాలి అని అనుకుంటున్నారు.. కానీ సంగీతం క్లాస్ పక్కన మరి ఏది ఉండకూడదు.. సంగీతాన్ని ప్రశాంతంగా ఆస్వాదించాలి అని అంటుంది తులసి.. తన ప్రపోజల్ ను సామ్రాట్ ముందు ఉంచుతాడు నందు.. తులసి చెప్పినట్టు ఈ ప్రపోజల్ చేస్తాను అంటేనే తను దీనికి సిద్ధమని లేకపోతే నాకు వద్దు అని డైరెక్ట్ గా సామ్రాట్ తో చెప్పేస్తుంది.. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది రేపటి ఎపిసోడ్ కి ట్విస్ట్..