Telugu TV Serials

మోనిత కొడుకును రంగంలోకి దింపి కార్తీక్ ను వసపరుచుకోవాలని చూస్తున్న మోనిత..!!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1457 వ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 14 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. మోనితకు బాగోలేదని చెప్పి కార్తీక్ డాక్టర్ ను తీసుకొస్తాడు. నిజంగానే జ్వరం వచ్చిందని అనుకొని డాక్టర్ ను తీసుకొచ్చాడా అని అనుకుంటుంది మోనిత. ఇంతలో డాక్టర్ కార్తీక్ ను చూసి మీరు డాక్టరే కదా అంటాడు.మోనిత షాక్. అవుతుంది. ఇక కార్తీక్ మాత్రం నేను డాక్టర్ ఏంటి అని అంటాడు. ఆ తర్వాత మోనితను చూసి మీరు కూడా డాక్టరే కదా అంటాడు. ఇంతకీ మీ పేరేంటి అని అడుగుతుంది మోనిత.

డాక్టర్ ఎవరో కనిపెట్టిసిన మోనిత :దీప చెప్పినట్టే ఇది ఖిలాడీ అని అనుకుంటాడు. తనకు జ్వరం లేకున్నా కూడా ఉందని నటిస్తోందని తెలుసుకొని కావాలని కొన్ని మందులు రాస్తాడు. అవి జ్వరం మందులు మాత్రం కాదు. దీంతో కోపంతో వీడు వంటలక్క క్యాండిడేటే అని అనుకుని డాక్టర్ ను ఎవర్రా నువ్వు వంటలక్క మనిషివి కదా నువ్వు అని అంటుంది మోనిత. దీంతో మోనిత వదులు అంటాడు కార్తీక్. ఈయన దీప వాళ్ల అన్నయ్య. ఆయన డాక్టర్ అని చెబితే తీసుకొచ్చా.నేను దీప వాళ్ల అన్నయ్యను అయితే ఇప్పుడు ఏంటి.. మీకు కావాల్సింది డాక్టరే కదా అంటాడు. అలా కాదు కార్తీక్ అది మెల్లగా ఇంట్లో చేరి నిన్ను లోబర్చుకోవాలని చూస్తోంది అంటుంది మోనిత.ముందు అతడిని ఇక్కడి నుంచి పంపించేయ్ కార్తీక్ అంటుంది మోనిత. దీంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మోనిత కొడుకుని కలిసిన హిమ :

మోనిత పని పట్టే పనిలో డాక్టర్ అన్నయ్య, దీప….!!


మరోవైపు హిమ స్కూల్ కు వెళ్తూ శౌర్య గురించే ఆలోచిస్తూ ఎందుకు శౌర్య నా మీద అంత కోపం పెట్టుకున్నావు. అమ్మానాన్నలను దూరం అయినందుకు నీకు ఎంత బాధగా ఉందో నాకు కూడా అంతే బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది.అదే సమయంలో హిమకు సరోజక్క కనిపిస్తుంది. ఇక ఒకరిని ఒకరు పలకరించుకుని శౌర్య ఎలా ఉంది అని అడుగుతుంది సరోజ..సౌర్య మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది అంటుంది..అయ్యో అవునా అమ్మా..ఆ మోనితమ్మ కూడా అంతే డాక్టర్ బాబుకు అలా జరిగాక.మొత్తం ఆస్తిని, బాబుని మా చెల్లెలుకు ఇచ్చి ఎక్కడికో వెళ్లిపోయింది అని అంటుంది సరోజక్క. అవునా ఒకసారి ఆనంద్ ను చూస్తా అని హిమ అంటే ఆనంద్ దగ్గరికి తీసుకెళ్తుంది సరోజ.

కొడుకుని తీసుకువస్తా అంటున్న మోనిత :ఇక మోనిత కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఒకవేళ కార్తీక్ కు గతం గుర్తొస్తే ఎలా అనే ఆలోచనలో పడుతుంది.ఎలా అయినా దీపను కార్తీక్ నుంచి దూరంగా పెట్టాలి. దీపను ఇక్కడి నుంచి తరిమేయడం మన చేతుల్లో లేదు కాబట్టి కార్తీక్ ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటుంది మోనిత.అప్పుడే ఏం ఆలోచిస్తున్నావు మోనిత అని అడుగుతాడు. తప్పిపోయిన మన బాబు గురించా అని అడుగుతాడు. దీంతో కార్తీక్ కు బాబు బాగానే గుర్తున్నాడు. ఎలాగైనా బాబును తీసుకురావాలి అని అనుకుంటుంది. చెన్నైలో ఉన్నాడని తెలిసింది నేను వెళ్లి తీసుకుని వస్తాను అంటాడు. కార్తీక్ వస్తా అంటే వద్దు అని అంటాడు. కార్తీక్ బాబు గురించి ఇంతలా తపన పడుతున్నాడంటే బాబును వెంటనే తీసుకురావడం మంచిది అని అనుకుంటుంది మోనిత.

భర్త గురించి బాధ పడుతున్న దీప :మరోవైపు హిమను బాబు దగ్గరికి తీసుకెళ్తుంది. సరోజ. ఆనంద్ తో కాసేపు ఆడుకుంటుంది. తర్వాత ఆనంద్ ను తనతో పాటు ఇంటికి తీసుకెళ్తా అంటుంది హిమ. వద్దు అమ్మా అంటారు లక్ష్మణ్, అరుణ.. నువ్వే వచ్చి ఆడుకో అని హిమకు సర్ది చెబుతారు. మరోవైపు దీప నేను ముందే చెప్పాను కదా అన్నయ్య అని ఆ డాక్టర్ తో అంటుంది. దానికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుందని తెలిస్తే ఇలాగే మీద పడిపోతుంది. నువ్వు ఒక్కడివే వెళ్తే బాగుండేది. నన్ను కూడా చూడగానే దానికి డౌట్ వచ్చింది అంటుంది.నా భర్తను నా దగ్గరికి తెచ్చుకోవడానికి నేను ఇంత బాధపడాల్సి వస్తుంది అని దీప బాధ పడుతుంది.
Share

Related posts

వసు ఆశయం కోసం రిషి తీసుకున్న నిర్ణయం ఏంటి… మరి వసు తన ఆశయాన్ని చేరుకుంటుందా..?

Ram

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

bharani jella

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి రేపటి ట్విస్ట్ ఇదే..!! 

bharani jella