2029 నాటికి ఏపీని నెంబర్ 1 రాష్ట్రం చేస్తా : చంద్రబాబు

Share

 తిరుపతి, డిసెంబర్ 20 : 2029 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా, 2050 కు ప్రపంచంలో దీ బెస్ట్ రాష్ట్రంగా ఎదుగుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  తిరుపతి – వికృతమాల  వద్ద గురువారం 158 ఎకరాలలో టీసీఎల్ ఇండస్ట్రియల్ పార్క్ కు ఆయన శంఖుస్థాపన, భూమి పూజ చేసారు. చైనీస్ భాషలో చైనీస్ అతిథులకు , పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీసీఏల్ కు తిరుపతి వచ్చిన ఈ రోజు ఆంధ్ర ప్రదేకు, తిరుపతికి చరిత్రాత్మకమైన రోజన్నారు.

తిరుపతి హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారబోతుందన్నారు. టీసీఎల్ లో ఆరు వేల మంది కి ఉపాధి లభిస్తుందన్నారు. ఐటీ , ఇండస్ట్రియల్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ లాంటి మరెన్నో పాలసీలను రూపిందిస్తున్నామని పేర్కొన్నారు. 59 ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి..అందులో చిత్తూరు జిల్లాదే సింహభాగం అని స్పష్టం చేశారు. సిలికాన్ సిటీగా తిరుపతిని ప్రకటిస్తూ తిరుపతి – నెల్లూరు – చెన్నై   సిలికాన్ కారిడార్ గా మారబోతోందన్నారు. కియా మోటార్స్ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారతాయన్నారు. టీసీఎల్ రాకతో వర్క్ కల్చర్, స్పీడ్, టెక్నాలజీ  పెరిగి పరిశ్రమలలో పోటీ పెరుగుతుందన్నారు.

టీసీఎల్ చైర్మన్ & సీఈఓ టామ్సన్ డీఎస్ లీ మాట్లాడుతూ గ్లోబల్ టీవీ మార్కెట్ లో జపాన్, కొరియాతో టీసీఎల్ పోటీ పడుతోందన్నారు. టీవీ ప్యానెల్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3 వ స్థానంలో ఉండగా,అమెరికా మార్కెట్ లో రెండవ స్థానంలో టీసీఎల్ ఉందన్నారు.టీసీఎల్ టీవీ లతో పాటు మొబైల్ ఫోన్స్, హోమ్ అప్లయెన్సెస్ తయారు చేస్తామన్నారు.ఇండియాలో ఆంధ్రప్రదేశ్ -తిరుపతిలో టీసీఎల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అందించిన సహకారం ప్రసంశనీయమని పేర్కంటూ  దీంతో గ్లోబల్ డిజిటల్ , టివి మార్కెట్ లో నెంబర్ వన్ గా ఎదుగుతామన్నారు.


Share

Related posts

తెలుగుదేశం ఎంపీ నిరశన

Siva Prasad

ఏపీలో ఇలా… ఎంపీలో అలా…! అదే పాలనలో తేడా…!!

somaraju sharma

పాక్ మానసికంగా వేధించింది: అభినందన్

sarath

Leave a Comment