ట్రెండింగ్

Ap Tenth Paper Leak: ఏపీలో వాట్సాప్ లో టెన్త్ పేపర్ లీక్ ఘటనలో 11 మంది అరెస్ట్..!!

Share

Ap Tenth Paper Leak: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే పేపర్ లీక్ కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా 11 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో అంకిరెడ్డి పల్లె… జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు నియమించిన విద్యా శాఖకు చెందిన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ రాజేష్ అనే వ్యక్తి ప్రశ్నాపత్రం యొక్క ఫోటో తీసి కొంత మంది ఉపాధ్యాయులకు సమాధాన పత్రాలను పొందడానికి పంపారని.. మీడియాకు ఉన్నతాధికారులు వెల్లడించారు.

andhra pradesh 10th exam paper leak in nandyal

ఈ ఘటనలో అవకతవకలకు పాల్పడిన రాజేష్ తో పాటు పలువురు ఉపాధ్యాయులను విచారణ చేసి అదుపులోకి తీసుకున్నట్లు కొలిమిగుండ్ల ఎమ్మార్వో, పోలీసులు, జిల్లా విద్యాశాఖ అధికారి మీడియాకు తెలియజేశారు. అయితే పరీక్ష ప్రారంభమైన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఏపీలో వాట్సాప్ లో ఉదయం 11 గంటల సమయంలో ఒక పరీక్షా కేంద్రంలో తీసిన ప్రశ్నాపత్రం ఫొటోలు వైరల్ అయ్యాయని వార్తలలో వాస్తవం లేదు. కానీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభమైందని.. ఈ ఘటనపై ఇంకోపక్క పాఠశాల విద్యాశాఖ స్పందించింది. CBSE Class 10 Board Exams 2021 cancelled: This is how marks will be allotted

ఇదిలా ఉంటే  ఉన్నత అధికారులు ప్రశ్నాపత్రం ఫోటో తీసిన రాజేష్ తో పాటు పలువురు ఉపాధ్యాయులను మొత్తంగా 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో పరీక్షను స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా.. నిర్వర్తించడంలో విఫలమైనందుకు పరీక్షా కేంద్రం యొక్క  ఇన్విజిలేటర్ వీరేష్, సిట్టింగ్ స్క్వాడ్ రాఘవయ్య.. సెంటర్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని సస్పెండ్ చేసినట్టు అధికారులు మీడియాకు తెలియజేశారు. ఈ పరిణామంతో పేపర్ లీక్ ఘటన వెలుగులోకి వచ్చిన పాఠశాల యాజమాన్యం పరీక్ష కేంద్రంలోకి ఎవరు మొబైల్ తీసుకెళ్లకుండా తాజాగా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.


Share

Related posts

Mumaith Khan : ముమైత్ కి ఇంత చెండాలమైన టెస్ట్ ఉంటుందని నేను అనుకోలేదు అంటున్న బాబా మాస్టర్..!!

bharani jella

Bigg Boss Telugu 5: నటరాజ్ మాస్టర్ కి.. బాలయ్య బాబు బిగ్ ఆఫర్..??

sekhar

బిగ్ బాస్ 4 : హౌస్ లో దెయ్యంగా 1st సీజన్ కంటెస్టెంట్ హరితేజ ట్రెండింగ్

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar