ట్రెండింగ్ న్యూస్ సినిమా

Aakashavaani : ఆకాశవాణి సినిమా నుంచి “మనకోన” పాటను రిలీజ్ చేసిన నాని..!!

Share

Aakashavaani : విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ కీలక పాత్రాధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభరెడ్డి నిర్మిస్తోన్న సినిమా “ఆకాశవాణి”.. దర్శకధీరుడు రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. తాజాగా న్యాచురల్ స్టార్ నాని మనోహరమైన & మట్టి పాట “మనకోన” ను రిలీజ్ చేసారు..

Aakashavaani: manakona song released by Nani
Aakashavaani: manakona song released by Nani

ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా, మంగళి ఆలపించారు.. ఇటీవల రాజమౌళి ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది.. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు, సింగర్ కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించగా, సురేష్ రగతు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్ గా జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా గా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి..


Share

Related posts

సర్కారు వారి పాట ..సూపర్ స్టార్ అంటే చిన్న విషయం కాదు ..!

GRK

బిగ్ బాస్ 4 : ఈ సారి టైటిల్ నాదే అంటున్న అఖిల్..! తాను పెద్ద మూర్ఖుడు అని అనేశాడు…

arun kanna

Vizag Steel Plant : మాటల్లేవ్ !మాట్లాడుకోడాల్లేవ్! స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం అడుగు ముందుకే !

Yandamuri