What’s App: ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ మొబైల్ అందుబాటులో ఉంది. మనిషి దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ కూడా భాగమైపోయింది. క్షణాలలో పనులు జరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా గాని అరచేతుల్లో మొత్తం సమాచారం అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతూ ఉన్నారు.
ఈ పరిణామంతో ఇప్పటికే వాట్సాప్ తమ యూజర్ల కోసం అనేక ఫీచర్లు అందుబాటులోకి తీసుకు రావడం తెలిసిందే. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో ఉండే రియాక్షన్స్.. వాట్సాప్ లోకి కూడా ఇటీవలే అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ప్రతి పోస్ట్ కి రియాక్ట్ అయ్యే మాదిరిగా… స్మైల్, లవ్ సింబల్, ఓకే, నమస్కారం, ఆశ్చర్యపోయే సింబల్, ఏడిచే ఈమోజి లు తీసుకు రాగా ఇప్పుడు మరో కొత్త ఫీచర్ వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. విషయంలోకి వెళ్తే వాట్సాప్ లో గ్రూపులు కూడా ఉంటాయన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మనం ఏదైనా వాట్సాప్ గ్రూపు నుండి బయటకు వచ్చేస్తే సభ్యులందరికీ చిన్న మెసేజ్ రూపంలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు… గ్రూపు నుండి బయటకు వచ్చేస్తే… ఒక్క అడ్మిన్ కి తప్పితే గ్రూపు సభ్యులకు ఎవరికీ తెలియకుండా కొత్త ఫీచర్ వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. అదేవిధంగా స్టేటస్ లో ఏదైనా వెబ్ సైట్ కి సంబంధించిన లింక్ షేర్ చేస్తే అది సాధారణ టెక్స్ట్ మాదిరిగా కనిపిస్తది. అయితే కొత్తగా వచ్చే అప్డేట్ లో స్టేటస్ లో లింకు కు సంబంధించిన డీటెయిల్స్ ప్రివ్యు… కనిపించనుంది. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్స్ వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…