గత నాలుగేళ్లుగా తెలుగు బుల్లితెర పై అద్భుతమైన టిఆర్పి రేటింగ్ లను అందుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఈసారి కూడా అదే హవా కొనసాగించింది. ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు దీని దెబ్బకు చిన్నబోయాయి దాని ఫలితంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి సక్సెస్ అయింది అంటే వెనుక నడిపిస్తున్న హోస్తుల పాత్ర ఎంతో ఉంది.
ఇక గత రెండు ఏళ్ళుగా నాగార్జున షో ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. ఇక రెండు రోజుల క్రితమే పూర్తి అయిన ఈ షో లో సీజన్ మొత్తానికి గానూ నాగార్జున అందుకున్న రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కు నాని హోస్ట్ లు గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక చివరి రెండు సీజన్లలో సీనియర్ నటుడు నాగార్జున తనదైన శైలిలో అద్భుతంగా నడిపించాడు.
బిగ్ బాస్ గ్రాండ్ ఓపెనింగ్ కు ఎన్టీఆర్ అందించిన సహకారం అద్భుతమనే చెప్పాలి. అందరి అనుమానాలకు ఫుల్స్టాప్ పెట్టేసి ఎన్ టి ఆర్ అద్భుతమైన హోస్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అతను ఎపిసోడ్ 40 లక్షల చొప్పున మొత్తం ఎనిమిది కోట్ల వరకూ తీసుకున్నాడు. ఆ సీజన్ 10 వారాల్లో జరిగింది. రెండవ సీజన్ నాని ఎపిసోడ్ కు 10 లక్షల రూపాయల చొప్పున మూడు కోట్లు తీసుకున్నాడు. అప్పుడు కౌశల్ ఆర్మీ త్ ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితుల్లో అతను కూడా చక్కగా నడిపించాడు.
నాగార్జున ఎపిసోడ్ కి 12 లక్షల చొప్పున 3.5 కోట్లు తీసుకున్నాడట. నాలుగో సీజన్ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం గమనార్హం. ఇక ఈ సీజన్ మొత్తానికి ఎపిసోడ్స్ ప్రకారం కాకుండా ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మొత్తంగా అందుకున్నాడు అని చెబుతున్నారు. అంటే నాగార్జున రెమ్యునరేషన్ గత సీజన్ కన్నా తక్కువ ఎన్టీఆర్ కన్నా ఎక్కువ. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సెట్ వేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని రెంట్ కూడా అతని ఖాతాలోకి వెళ్ళింది.