RRR: బాలీవుడ్ ఇండస్ట్రీకి మొదటి నుండి సౌత్ సినిమాలంటే చాలా చులకన ఎక్కువ. దీంతో పెద్ద పెద్ద ఫిలిం ఫెస్టివల్స్ జరిగిన టైంలో దక్షిణాది సినీ ప్రముఖులకు సరైన గౌరవం లభించేది కాదు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఒకసారి తెలుగు సినిమా వజ్రోత్సవం కార్యక్రమం కూడా తెలియజేశారు. ఆ రీతిలో బాలీవుడ్ దక్షిణాది సినిమాల పట్ల చిన్నచూపు చూస్తున్న తరుణంలో.. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి తీశాడో… బాలీవుడ్ మొదలుకుని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వారికి అన్ని రికార్డులను పగలగొట్టడం జరిగిందో… బాహుబలి దెబ్బకు బాలీవుడ్ షేక్ అయిపోయింది.
ఒకప్పుడు ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రపంచ సినీ ప్రేమికులకు రాజమౌళి పేరు మొదట వినబడుతుంది. దీంతో బాలీవుడ్ లో సౌత్ సినిమాలకు భారీ గిరాకీ పెరిగింది. అంతమాత్రమే కాదు బాలీవుడ్ టాప్ హీరోలు దక్షిణాది డైరెక్టర్లతో పనిచేయడానికి క్యూ కట్టే పరిస్థితి జక్కన్న తీసుకొచ్చాడు. అదే రీతిలో ప్రభాస్ క్రేజ్ కూడా బాలీవుడ్ టాప్ హీరోలందరూ కంటే భారీగా ఉండటం తెలిసిందే. కాగా ఇటీవల ప్రభాస్ నటించిన “రాదేశ్యం” భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి…ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది.
దీంతో బాలీవుడ్ కి మద్దతు తెలిపే ఓ మీడియా వర్గం… ఇటువంటి పరిస్థితి కోసం కాచుకుని కూర్చుని.. ఉన్నట్టు.. “రాధేశ్యామ్” డిజాస్టర్ ఎంజాయ్ చేసినట్లు.. వార్తలు మాత్రమే కాదు ట్రోలింగ్ చేయడం జరిగింది. ప్రభాస్ నీ కించపరుస్తూ సౌత్ సినిమాలు తక్కువ చేస్తూ పైశాచిక ఆనందం పొందింది. ఇటువంటి తరుణంలో రాజమౌళి “ఆర్ఆర్ఆర్” బాణం మొదలవటం తో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. సౌత్ సినిమాలను తక్కువ చేస్తూ ఉండే బాలీవుడ్ ఆ మీడియా వర్గం కి మూగబోయినటు అయిపోయింది. “ఆర్ఆర్ఆర్” లో సన్నివేశాలు చూసే ప్రేక్షకుడిని.. భారీ ఎత్తున ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రమే కాదు రోమాలు నిక్క పొడుచుకునేలా.. చేస్తూ ఉండటం తో సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. కించపరిచే ఆ మీడియా వర్గం సైలెంట్ అయిపోయింది. దీంతో ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అనేది ఉత్కంఠ భరితంగా మారింది.