ప్రపంచంలోనే అతికొద్ది మందిలో మాత్రమే ఉండే ‘బ్లడ్ గ్రూప్’ అంటే ఎవరైనా బాంబే బ్లడ్ గ్రూప్ అని చెబుతారు. కానీ.. అంతకంటే అరుదైన మరో బ్లడ్ గ్రూప్ ఉంది. చాల తక్కువ మందిలో ఉండే రక్త గ్రూపు ‘గోల్డెన్ బ్లడ్’.
‘గోల్డెన్’ ఆ పేరులోనే అర్థమైపోతుంది అది ఎంత ప్రత్యేకమో. ఈ రక్తం కలిగిన వారు ఇతరులకు రక్తాన్ని ఇవ్వొచ్చు. కానీ, వారికి రక్తం అవసరమైనప్పుడు మాత్రం దాతలు దొరకటం చాల కష్టం.
సాధరణంగా మనుషుల్లో ఏ, బీ, ఎబీ, ఓ రక్తం గ్రూపులు ఉంటాయి. మరి గోల్డెన్ బ్లడ్ గ్రూపులో Rh null ఉంటుంది. అంటే ‘ఏ’ బ్లడ్ గ్రూపులో యాంటీజెన్ ఏ ఉంటుంది. అలాగే ‘బీ’ బ్లడ్ గ్రూపులో యాంటీజెన్ బీ, ఇక ఏబీ బ్లడ్ గ్రూపులో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ బ్లడ్ గ్రూపులో ఏ, బీ రెండూ ఉండవు. అలాగే, ఎర్ర రక్త కణాలు
61 Rh- రకానికి చెందిన RhD అనే మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి. బ్లడ్‌లో RhD ఉంటే పాజిటివ్ లేకుంటే నెగెటివ్ అంటారు. Rh null అనే అరుదైన గోల్డెన్ బ్లడ్ గ్రూపులో ఎర్ర రక్త కణాల్లో Rh యాంటీజెన్ ఉండదు.
ఎవరి శరీరంలోనైనా యాంటీజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్‌ను అత్యంత అరుదైన గ్రూపుగా పరిగణిస్తారు. యాంటీజెన్ అనేది శరీరంలోని యాంటీబాడీలో తయారవుతుంది. అది శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది.
గడచిన 52 సంవత్సరాల్లో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది. ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉండటం విశేషం.