Drumstick Flowers: పచ్చదనం తో కళకళలాడే మునగ ఆకులే కాదు సువాసనభరితమైన తెల్లని పూలు నిండా ఔషధ గుణాలు ఉన్నాయి.. ఆయుర్వేద వైద్యంలో మునగ పువ్వులను పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నారు.. మునగ పూలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!
ఒక గ్లాస్ నీటిలో ఈ పూలను వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకుని ఈ కషాయాన్ని బాలింతలు తాగితే పాలు బాగా పడేలా చేస్తుంది. ఈ పూలతో తయారు చేసుకున్న టి తాగడం వలన మూత్ర వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. మూత్రంలో మంట, అసౌకర్యం, మూత్రంలో రాళ్లుని కూడా తగ్గిస్తుంది..
జలుబుతో బాధపడుతున్నారా అయితే వేడి వేడిగా పువ్వుల టీ తాగండి వెంటనే ఉపశమనం లభిస్తుంది ఆయుర్వేద వైద్యంలో జలుబుకి ఈ టి చక్కటి ముందుగా అభివర్ణిస్తారు పూలతో మాత్రమే కాదు రకరకాల స్నాక్స్ తయారు చేసుకుని తినవచ్చు కొన్ని ప్రాంతాలలో పూలను శనగపిండిలో ముంచి పకోడీ లా చేస్తారు. ఈ చెట్టు పూలతో కూర కూడా వండుకుని తినవచ్చు. మునగ పూలలో తేనె ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ పూలను తేనెటీగలు ఆకర్షించి తేనె ఉత్పత్తికి సహాయపడతాయి. మునగ పూల ను పాలలో వేసి మరిగించి తాగితే వీర్య వృద్ధి చెందుతుంది. ఈ పూలను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పాలలో కలిపి తీసుకుంటే సంభోగ శక్తి పెరుగుతుంది. ఈ పాలను పురుషులు, స్త్రీలు ఇద్దరు తాగచ్చు.