NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Naidu: చంద్రబాబు ని అరస్ట్ చేసిన విధానం తో జగన్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ ??

Jagan's government has set itself a goal by arresting Chandrababu

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో 37వ నిందితుడుగా చంద్రబాబు పేరును చేర్చారు. కేసులో నిందితుడుగా ఉన్న ఎవరినైనా అరెస్టు చేయడంలో తప్పులేదు కానీ చంద్రబాబును అరెస్టు చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చేలా ఉందనే మాట వినబడుతోంది. ప్రస్తుతం చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉన్నారు. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉండగా అర్ధరాత్రి సమయంలో ఆయనను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వెళ్లడం విమర్శలకు దారి తీస్తొంది.

Jagan's government has set itself a goal by arresting Chandrababu
Jagan’s government has set itself a goal by arresting Chandrababu

స్కిల్ డవలప్ మెంట్ కుంభకోణం కేసులో రూ.371 కోట్లు దారి మళ్లాయని వైసీపీ సర్కార్ గుర్తించింది. దీనిపై నిగ్గు తేల్చిన మంత్రివర్గ ఉప సంఘం విచారణ చేపట్టింది. అనంతరం 2020 డిసెంబర్ 10న విజిలెన్స్ విచారణ, 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసును 2021 డిసెంబర్ 9న సీఐడీకి బదిలీ చేశారు. 166, 167, 418, 420, 465, 468, 471,409, 201, 109 రెడ్ విత్ 120 బీ ఐపీసీ, 13(2), రెడ్ విత్ 13(1)సీ, రెడ్ విత్ 13(1)(డీ) పీసీఏ సెక్షన్ ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఓ రాజకీయ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న నాయకుడిని అరెస్టు చేసిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Jagan's government has set itself a goal by arresting Chandrababu
Jagan’s government has set itself a goal by arresting Chandrababu

చంద్రబాబును అరెస్టు చేయాలని భావిస్తే పర్యటనలో జనాల మధ్య ఉన్నప్పుడు కాకుండా ఇంటి వద్ద ఉన్నప్పుడు నోటీసు అందజేసి ఉంటే ఇంత రాద్ధాందం కాదనే మాట వినబడుతోంది. చంద్రబాబు చుట్టూ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్న సమయంలో అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారి తీస్తుందని తెలిసి కూడా సీబీఐ అధికారులు అలా ఎందుకు చేశారనే మాట అధికార పార్టీ సానుభూతి పరుల నుండి కూడా వస్తొంది. చంద్రబాబు అరెస్టు పై నంద్యాల నడిరోడ్డులో హైడ్రామా నడిచింది. చంద్రబాబును అరెస్టు చేస్తున్న క్రమంలో ఆయన న్యాయవాదులు, ఇతర నాయకులు సీఐడీ అధికారులను ప్రశ్నించడాన్ని న్యూస్ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి కూడా. ఇలాంటి చర్యలు చంద్రబాబుకు రాజకీయంగా మైలేజీ పెంచడానికే తప్ప, అధికార పార్టీ సాధించింది ఏమిటో అర్ధం కావడం లేదని అంటున్నారు.

Jagan's government has set itself a goal by arresting Chandrababu
Jagan’s government has set itself a goal by arresting Chandrababu

మరో వైపు చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు పిలుపునిచ్చారు. సీఐడీ చేసిన ఈ చర్య టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్గిస్తుందని భావిస్తున్నారు. చంద్రబాబు ను అరెస్టు చేసిన విధానం చూస్తే జగన్ సర్కార్ సెల్ఫ్ గోల్ చేసుకుందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. ప్రజల్లో సానుభూతి పొందేందుకే చంద్రబాబు రెండు రోజుల క్రితమే తనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనీ లేకపోతే దాడి జరగవచ్చని సంచలన కామెంట్స్ చేశారు.

Jagan's government has set itself a goal by arresting Chandrababu
Jagan’s government has set itself a goal by arresting Chandrababu

ఒ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటనలో ఉన్న తరుణంలోనే సీఐడీ ఈ కేసులో అరెస్టులకు సిద్దమవుతుందన్న సమాచారం ముందుగా చంద్రబాబుకు అందడం వల్లనే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. పక్కా సమాచారం ఉండటం వల్ల చంద్రబాబు కొద్ది రోజులుగా జనాల మధ్య ఉంటూ పర్యటనలు పెట్టుకున్నారని అనుకుంటున్నారు. పలు వైసీపీ అనుకూల మీడియాలోనూ చంద్రబాబు అరెస్టు తీరును తప్పుబడుతూ కథనాలు ఇస్తుండటం గమనార్హం. ఇది జగన్ సర్కార్ సెల్ఫ్ గోల్ అనే ప్రచారం జరుగుతోంది.

Chandrababu: చంద్రబాబు ఊహించిందే జరిగింది.. చంద్రబాబును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju