32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ట్రెండింగ్

Malgudi: కాల్పనిక పట్టణమైన మాల్గుడికి ఎలా చేరుకోవాలి? How to reach the fictional town of Malgudi from Malgudi Days Serial in real life?

Malgudi Village from Malgudi Days Serial and RK Narayans Malgudi Days
Share

Malgudi: సాహిత్యానికి ఎంతటి శక్తి ఉందో పలుమార్లు వినే ఉంటాం.. కానీ ఆర్ కే నారాయణ్ మాత్రం తన సాహిత్యంతో ఎల్లలు దాటేలా చేశారు.. ఈయన మాల్గుడి అనే ఒక కాల్పానికి పట్టణాన్ని సృష్టించి దానిలోని ప్రజలు వారి వ్యవహారాల గురించి ధారావాహిక నవలలు, కథలు రాశాడు.. ఆంగ్ల భాషలో భారత సాహిత్య రంగానికి ప్రారంభంలో పునాదులు వేసిన ముగ్గురు గొప్ప రచయితలలో ఆర్ కే నారాయణ్ కూడా ఒకరు. సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆర్ కే నారాయణ్ కి విశిష్టమైన పేరు ఉంది. ఈయన భారతదేశానికి చెందిన ఆంగ్లభాష నవలా రచయితలలో ఎన్నదగిన వారిలో ఒకరు..

Malgudi Days: ఆర్ కే నారాయణ్ జై కొట్టాల్సిందే..!

ఆర్ కే నారాయణ్ రాసిన కథలలో చాలా వరకు మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణం భూమికగా జరుగుతాయి. మొదటిసారి ఈ ఊరు స్వామి అండ్ ఫ్రెండ్స్ నవలలో పరిచయం చేయబడింది. ఈయన కథలు సామాజిక సంబంధాలను ఎత్తిచూపి రోజు వారి జరిగే యదార్థ సంఘటనల ద్వారా పాత్రలకు ప్రాణం పోశాయి. నిజమనిపించే ఒక కల్పిత పట్టణాన్ని సృష్టించి దాని ద్వారా సామాన్య జీవితాలలోని హాస్యాన్ని, సాదాసీదాతనాన్ని బయటకు చూపి తన రచనలో మానవత్వం దయ చూపాయి. 1930 లో నారాయణ్ తన మొదటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ ని రచించారు. మాల్గుడి డేస్ అనే ఆయన మొదటి చిన్న కథల సంపుటం 1942 నవంబర్లో ప్రచురించబడింది. ఆ తరువాత 1945లో ది ఇంగ్లీష్ టీచర్ గా ప్రచురించబడింది.

ఆర్ కే నారాయణ్ రాసిన మాల్గుడి డేస్ నవలను తర్వాత సీరియల్ గా తీశారు ఈ సీరియల్ అన్ని భాషలలోనూ మంచి ప్రాముఖ్యతను సాధించుకుంది. ఆయన సృష్టించుకున్న కాల్పానిక పట్టణం మాల్గుడిని నిజం చేశారు భారతీయ రైల్వేస్. ఇప్పుడు ఆ మాల్గుడిని తలపించే విధంగా నారాయన్ ఏ విధంగా అయితే తను సృష్టించుకున్నారో అచ్చం అలాగే ఉండేలాగా ఓ మ్యూజియం ని కర్ణాటకలో ఏర్పాటు చేశారు. ఆయన రాసిన సాహిత్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ఒక్క విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్కే నారాయణ సృష్టించుకున్న గ్రామానికి నిజరూపం ఇచ్చారు. ఆ మ్యూజియంతో సాహిత్యానికి గొప్ప శక్తి ఉంది అనడంలో ఇంతకు మించిన నిదర్శనం ఏమి కావాలి. అర్ కే నారాయణ్ సాహిత్యానికి జై కొట్టాల్సిందే. సాహిత్యంలో ఆయనకు ఎన్నో అవార్డులు రివార్డులు లభించాయి. పద్మభూషణ్ కూడా ఇచ్చారు.

Malgudi Days: A museum in Karnataka for visitors to get the feel of Malgudi Village from the Malgudi Days Serial
Malgudi Days: A museum in Karnataka for visitors to get the feel of Malgudi Village from the Malgudi Days Serial

మైసూరులో నారాయణ్ నివసించిన గృహాన్ని 2016లో ఇతని గౌరవ సూచకంగా ఒక మ్యూజియంగా మార్చారు.

మాల్గుడి వెనుకున్న రెండు పేర్లు..!

మాల్గుడి పదాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో రెండు పదాలు బెంగళూరు మైసూర్ కి చెందిన దగ్గర పదాలు లాగా అనిపిస్తాయి. Malgudi లో మొదటి మూడు అక్షరాలు చివరి 4 అక్షరాలను ఒకసారి పరిశీలిస్తే బెంగుళూరు కి చెందిన 2 ప్రధాన ఏరియాలకు చెందిన పదాలలో నుంచి ముందు చివర అక్షరాలను తీసుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. బెంగుళూరులోని మల్లేశ్వరం ( Malleswaram) లో Mal అలాగే బసవన్నగుడి (Basavanagudi) లో Gudi ఇలా ఈ రెండు పదాలను కలిపితే మాల్గుడి Malgudi తీసుకున్నట్టు తెలుస్తోంది.

Malgudi Days Serial: మాల్గుడి డేస్ దూరదర్శన్ లో..

1987 లో టీవి సీరియల్ గా తీసుకుని వచ్చారు. ఈ సీరియల్ ప్రతి బుధవారం దూరదర్శన్ లో ప్రసారమయ్యేది. ఇందులో మొత్తం 54 ఎపిసోడ్స్ ఉంటాయి. కన్నడ సినిమా నటుడు డైరెక్టర్ శంకర్ నాగ్ 34 ఎపిసోడ్ లను డైరెక్ట్ చేశారు. ఆ తరువాత దర్శకురాలు అయిన అలంకేష్ 15 ఎపిసోడ్స్ ను డైరెక్ట్ చేశారు. వివిధ కథల సమాహారమే ఈ మాల్గుడి డేస్.. ఈ సీరియల్ స్వామి అండ్ ఫ్రెండ్స్ తో మొదలవుతుంది.. స్వామి అండ్ ఫ్రెండ్స్ చేసిన అల్లరి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మాల్గుడి డేస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, కన్నడ మొదలైన భాషలలో సీరియల్ గా అనువదించారు.

మాల్గుడి డేస్ మ్యూజియం..

ఆర్ కే నారాయణ్ రాసిన మాల్గుడి డేస్ కాల్పానిగా పట్టణమైన మాల్ గుడికి నిజమైన ప్రాణం పోసింది ఇండియన్ రైల్వేస్ .. ఈ సీరియల్ లో చెప్పినట్టుగానే ఈ మ్యూజియంలో ఆ పల్లెటూరి వాతావరణంలో శివ అండ్ ఫ్రెండ్స్ చేసిన అల్లరి, రకరకాల చిత్రాలను బొమ్మలను, ఆర్ట్స్ ను ఆ మ్యూజియంలో పొందుపరిచారు. ఈ మ్యూజియం అరసులురు రైల్వే స్టేషన్ శివమొగ్గ కర్ణాటకలో ఉంది. పాత రైల్వే స్టేషన్ ని మ్యూజియం గా మార్చారు. ఇక కొత్త రైల్వే స్టేషన్ ని కాస్త దూరంలో ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ వాళ్లు మాల్గుడి డేస్ మ్యూజియంలో ఉన్న వాటిని ఉపయోగించుకొని సినిమాల చిత్రీకరణ చేసుకోవటానికి కూడా వెసూలు బాటును అందించింది. ఇప్పుడు ఈ మ్యూజియం చూడడానికి జనాలు బారులు తీరుతున్నారు. ఈ మ్యూజియం సందర్శించిన అందరూ ఎన్నో జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టు గుర్తు చేసుకుంటున్నారు.

Related Link: Official website for visiting Malgudi Town in Karnataka by Karnataka Tourism

Malgudi and Mahatma Gandhi: మాల్గుడి – గాంధీ..

స్వర్గపు అంచులను తలపించే మెంపి అడవులు పచ్చని కొండలతో ఊపిరి పీల్చుకునే సమయాన్ని ఇవ్వని సరయు నది తీరనా చారిత్రాత్మక మాల్గుడి రైల్వే స్టేషన్ గర్వించదగినది.. 1937 లో మాల్గుడి ఈ చిన్న పట్టణాన్ని సందర్శించినప్పుడు మహాత్మా గాంధీజీ ఇక తన సమావేశాలన్నీ ఈ అందమైన సరయు నది ఒడ్డున సరిగ్గా జరిగలని నిర్ణయించుకున్నారట అలా మాల్గుడి కి బాపూకి సంబంధం ఉంది.

Meet Cute: మీట్ క్యూట్ రివ్యూ.. అంతా క్యూటేనా.!?


Share

Related posts

బిగ్ బాస్ 4 : గంగవ్వ లా మరో కంటెస్టెంట్ బయటకు..! జరిగిన ప్రమాదం అలాంటిది మరి

arun kanna

Ginger Oil: ఈ నూనె తో జలుబు నుంచి క్యాన్సర్ వరకు అన్నింటినీ నయం చేస్తుంది..!!

bharani jella

బిగ్ బాస్ 4 : డబుల్ ఎలిమినేషన్ గుట్టు ఇదే..! కంటెస్టెంట్స్ ని పిచ్చోళ్ళను చేయనున్న నాగార్జున

arun kanna