RRR : ‘ఆర్ఆర్ఆర్’ రైట్స్ ను దక్కించుకున్న పెన్ ఇండియా స్పెషల్ ట్వీట్ వైరల్..

Share

RRR : రాజమౌళి సినిమాలు తీయడం లోనే కాదు.. తీసిన సినిమా బిజినెస్ చేసుకోవడంలోనే మాస్టరే.. తాజాగా జక్కన్న నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నార్త్ ఇండియన్ థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది.. ఈ సందర్భంగా పెన్ ఇండియా లిమిటెడ్ ట్విట్టర్ లో ఎస్ఎస్ రాజమౌళి, డి.వి.వి.దానయ్య కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. అంతేకాకుండా మీతో భాగస్వామ్యం కావడానికి మేమిద్దరం గర్వంగా, వినయం గా ఉన్నాము అంటూ ట్వీట్ చేశారు..

బాలీవుడ్లో భారీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ‘పెన్ ఇండియా’ ‘ఆర్ఆర్ఆర్’ కోసం రికార్డు స్థాయి ధర కోట్ చేసిందట.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగన్, ఆలియాభట్ కీలక పాత్రలో కనిపించినున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏడాది అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Share

Related posts

ప్యాన్ ఇండియా చిత్రంగా అనుష్క మూవీ

Siva Prasad

రెండో విడతలో 61 శాతం పోలింగ్

sarath

Bhanu Sri Amazing Pics

Gallery Desk