Sonu Sood: సోను సూద్ రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు చేసినప్పటికీ.. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి తన వంతు సాయం చేస్తూ రియల్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. తాజాగా ఈ రియల్ హీరో భావోద్వేగానికి లోనయ్యారు.. నేడు ఫాదర్స్ డే సందర్భంగా జ్ఞాపకం గా ఉన్న స్కూటర్ పై కూర్చున్న ఫోటో ని షేర్ చేస్తూ అందరికీ ఫాదర్స్ డే విషెస్ తెలియజేశారు..!! ఈ ఫోటోని షేర్ చేస్తూ తన తండ్రి గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు..!!
Read More: Maestro: నితిన్ మాస్ట్రో సినిమా షూటింగ్ పూర్తి.. ఈ సినిమాలో ఇవే హైలైట్ సీన్స్..
“ప్రియమైన నాన్న.. మీరు ఇప్పుడు నాతో లేరు.. కానీ మీకు ఎంతో ఇష్టమైన స్కూటర్.. ఎల్లప్పుడూ నాకు అత్యంత విలువైన వాటిలో ఒకటి.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూ ఉంటాను.. హ్యాపీ ఫాదర్స్ డే అని ట్వీట్ చేశారు.. ఈ సందర్భంగా తన తండ్రి శక్తి బ్లాక్ అండ్ వైట్ ఫోటో, తన తండ్రికి ఎంతో ఇష్టమైన స్కూటర్ పై దిగిన ఫోటోలను పంచుకున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇటీవల సోనూసూద్ “సంభవం” పేరుతో ఐఏఎస్ చదువుకోవాలనే ప్రతి ఒక్కరికి ఉచిత శిక్షణ, స్కాలర్ షిప్ అందించనున్నారు. తన సేవలతో రీల్ విలన్ కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్..
Dear Dad,
You are not around but your favourite scooter will always be my most priced possession.
Miss you always. ❣️#HappyFathersDay pic.twitter.com/BysHSda7Jf— sonu sood (@SonuSood) June 20, 2021