NewsOrbit
ట్రెండింగ్

Beating Heart Diamond: ప్రపంచంలోనే అరుదైన వజ్రం గుజరాత్ లో బయటపడింది..!!

Advertisements
Share

Beating Heart Diamond: వజ్రాల వ్యాపారంలో భారత్ పేరుగాంచింది. ఇండియాలో తయారు చేసే వజ్రాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే 90 శాతం వజ్రాలు ఇండియాలోనే కట్ చేస్తారు.. ఇక్కడే సానబెడతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలన్నీ భారత్ లో దొరికినవే. వజ్రాలను సానబెట్టడంలో రకరకాల నగలు తయారు చేయడంలో భారత్ తీరు వేరు. ఇండియాలో ఎక్కువగా గుజరాత్ లోని సూరత్, ముంబాయి వంటి చోట్ల వజ్రాల పరిశ్రమలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సూరత్ లో ఓ అరుదైన వజ్రం బయటపడింది. ఈ వజ్రం స్పెషాలిటీ ఏమిటంటే వజ్రం లోపల మరో వజ్రం.. దాగి ఉంది. గుజరాత్ లో సూరత్ లో వీడీ కంపెనీకి దొరికింది. లోపల వజ్రం కూడా అటు ఇటు కదులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నట్లు కంపెనీ చెప్పుకొచ్చింది.

Advertisements

World's rarest diamond discovered at Surat in Gujarat State

ఇది 0.329 క్యారెట్ల బరువు ఉంది. దీనికి “బీటింగ్ హార్ట్” అనే నామకరణం చేశారు. ప్రపంచంలో ఇటువంటి వజ్రం మరొకటి లేదని కంపెనీ చైర్మన్ వెల్లడించారు. వీడీ కంపెనీ వజ్రాల వ్యాపారంలో టాప్ మోస్ట్ పాపులర్ సంస్థ. ఈ క్రమంలో బీటింగ్ హార్ట్ వజ్రాన్ని… పరీక్షలకు గాను లండన్ కి పంపించారు. అక్కడివారు సైతం ఈ వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇటువంటి వజ్రాన్ని ఇప్పటివరకు చూడలేదని ఆ పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రపంచంలో ఇటువంటి వజ్రం మరొకటి లేదు కాబట్టి.. ధర కూడా ఎక్కువగానే పలుకుతుంది. దీన్ని ఎవరు కొనుగోలు చేస్తారో వారికి అన్నిటిలో మంచి శుభాలు కలుగుతాయని చెప్పుకొస్తున్నారు.

Advertisements

World's rarest diamond discovered at Surat in Gujarat State

వర్తక వ్యాపారానికి భారత్ ప్రపంచ దేశాలకు ఆశాజనకం. అటువంటి మనదేశంలో గుజరాత్ రాష్ట్రంలో దొరికిన ఈ అరుదైన వజ్రం లోపల మరో వజ్రం కదులుతున్న.. డైమండ్ వార్తా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎవరు దక్కించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే గతంలో ఇదే తరహాలో 2021లో ఆస్ట్రేలియాలో కూడా ఇటువంటి వజ్రాన్ని కనుగొన్నట్లు.. తాజా ఫోటోలపై కామెంట్లు వస్తున్నాయి. ఆ వజ్రానికి  మాత్రేయోష్క అనే పేరు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా.. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఈ వెరైటీ డైమండ్ వార్తా సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


Share
Advertisements

Related posts

Vakkaya: వామ్మో వాక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా..!!

bharani jella

IND vs ENG : అన్నింటిలో కోహ్లీ నెంబర్ 1..! రోహిత్ నెం. 2

arun kanna

Modi Immanuel Macrone: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో త్వరలో మోడీ భేటీ..!!

sekhar