కర్నాటక సీఎం నివాసానికి బాంబు బెదరింపు

ఏకంగా కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నివాసంలో బాంబు పెట్టామంటూ బెంగళూరు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యాయి. బెంగళూరులోని కుమారస్వామి నివాసాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదరింపు ఫోన్ కాల్ ఉత్తిదేనని నిర్థారించుకున్నారు.

అనంతరం ఫోన్ నంబర్ ఆధారంగా బెదరింపు కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. సరదాగా ఆటపట్టించడానికి ఫోన్ చేసినట్లుగా సదరు వ్యక్తి చేప్పడంత పోలీసులు కంగుతిన్నారు. పోలీసులను తప్పుదోవపట్టించేందుకు తన పేరు కూడా మార్చి చెప్పినట్లు అంగీకరించాడు.