వివాదాస్పదంగా మన్మోహన్ సింగ్ సినిమా

ముంబై, డిసెంబరు 28: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై రూపొందుతుందించిన యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ మూవీ రాజకీయంగా దుమారంలేపుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఎ అధినేత్రి సోనియాగాంధీలపైన తప్పుడు ప్రచారం చేసే విధంగా ఉందని కాంగ్రెస్ మండిపడుతోంది. సినిమా విడుదల చేసే ముందుగానే ప్రివ్యూను తమకు చూపించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌ టైటిల్‌ పాత్రను పోషించిన ఈ సినిమా విడుదలకు ముందే తమకు ప్రదర్శించకపోతే అడ్డుకుంటామంటున్నారు. ఈ సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే దేశ వ్యాప్తంగా  విడుదల కానివ్వబోమని హెచ్చరించింది.