(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఓ పిల్ల సింహం చేసిన తుంటరి పనితో తన తల్లి సింహం భయపడింది. స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ జంతు ప్రదర్శనశాలలో తల్లి సింహం కూర్చుని ఎన్‌క్లోజర్స్‌లో ఉన్న తన కూనలు చేస్తున్న సందడిని చూస్తూ ఉంది. అయితే, ఓ చిట్టి సింహం వెనుక వైపు నుంచి నిశబ్దంగా వచ్చి.. ఒక్కసారిగా తల్లి సింహాన్ని భయపెట్టింది. దీంతో ఆ తల్లి సింహం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దృశ్యం ఎన్‌క్లోజర్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఎడిన్ బర్గ్ జూ అధికారులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
https://www.facebook.com/EdinburghZoo/videos/942056856166604/
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 42 వేల మందికిపై చూశారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ ఆడ సింహం ఐదు కూనలకు జన్మనిచ్చింది. అయితే, ప్రస్తుతం మూడు మాత్రమే ప్రాణాలతో ఉన్నాయి. ఈ కూనల తండ్రి జయేంద్రను 2012లో ఎడిన్ బర్గ్ జూకు తీసుకొచ్చారు.