NewsOrbit
Right Side Videos

పాపం బుజ్జి ఖడ్గమృగం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఖడ్గమృగం అచేతనంగా పడిఉంటుంది. నెలలు కూడా నిండని బుల్లి ఖడ్గమృగం తల్లికి ఏమయిందో తెలియక దానిని లేపేందుకు ప్రయత్నిస్తుంటుంది. హృదయాలు ద్రవింపజేసే ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో తిరుగుతోంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కాశ్వాన్  ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

వన్యమృగాలను అక్రమంగా వేటాడడం ఎంత దుర్మార్గమో మరోసారి జనానికి తెలిపేందుకు గత ఏడాది నాటి ఈ వీడియాను పోస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఈ వీడియోను తీశారు. హంతక వేటగాళ్లు తల్లి ఖడ్గమృగాన్ని చంపి దాని కొమ్ములు నరుక్కు వెళ్లారు. పిల్ల ఖడ్గమృగాన్ని దాని చావుకు దాన్ని వదిలివెళ్లారు.

బుల్లి ఖడ్గమృగాన్ని తర్వాత వన్యప్రాణుల విభాగం సిబ్బంది రక్షించి శరణాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ దానికి  కార్లొటీ అని పేరు పెట్టి పెంచుతున్నారు.

ప్రపంచం మొత్తం మీద ఉండే ఖడ్గమృగాలలో 80 శాతం దక్షిణాఫ్రికాలోనే ఉన్నాయి. దాని కొమ్ముకోసం ఖడ్గమృగాన్ని వేటాడుతారు. ఆఫ్రికా జాతి ఖడ్గమృగానికి రెండు కొమ్ములు ఉంటాయి. ఇండియా, అస్సాంలోని కజిరంగా  అటవీ ప్రాంతంలో నివసించే జాతి ఖడ్గమృగాలకు ఒకే కొమ్ము ఉంటుంది. దక్షిణాఫ్రికాలో ఒక్క 2018 లోనే 769 ఖడ్గమృగాలను అక్రమంగా వేటాడారు.

ఖడ్గమృగం కొమ్ముకు వియత్నాంలో విపరీతమైన గిరాకీ ఉంది. అక్కడ కిలోగ్రాము బరువు కొమ్ముకు 70 లక్షల రూపాయల వరకూ ధర పలుకుతుంది. ఖడ్గమృగం కొమ్ము కాన్సర్‌ని తగ్గిస్తుందన్న నమ్మకం అక్కడ ప్రచారంలో ఉంది. ఇది పుంసత్వాన్ని పెంచుతుందన్న నమ్మకాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఖడ్గమృగం కొమ్మును ఆల్కాహాల్‌తో పాటు పార్టీలలో సేవించే పదార్ధంగా కూడా వాడుతున్నారు.

అటవీశాఖ అధికారి పర్వీన్ కాశ్వాన్  ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. చాలా మంది ఆగ్రహంగా బాధగా స్పందించారు. చాలమంది దీనిని షేర్ చేశారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment